టాలీవుడ్ లో జంద్యాల దర్శకత్వంలో ‘ఆహనా పెళ్లంట’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు కామెడీ కింగ్ బ్రహ్మానందం.  ఆ సినిమా మొదలు ఆయన మళ్లీ వెనక్కి చూసుకోలేదు.. గిన్నీస్ రికార్డు కు ఎక్కేన్ని సినిమాల్లో నటించారు.  కేవలం తన హావభావాలతోనే థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల గొప్ప హాస్య నటులు బ్రహ్మానందం. ఆ మద్య ఆయనకు గుండె సంబంధిత ఆపరేషన్ అయ్యింది.. దాంతో కొంత కాలం రెస్ట్ తీసుకున్నారు.  మళ్లీ ఆయన వెండితెరపై తనదైనా మర్క్ చాటుకోవడానికి సిద్దమయ్యారు.  కృష్ణ వంశి దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారట.  ఇక లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు.

 

ఇంట్లో వాళ్ల అనుభవాలు.. బయట పరిస్థితుల గురించి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలో తీసుకుంటున్నారు. తాజాగా  సినీ హాస్యనటుడు బ్రహ్మానందంను పలకరించిన మీడియాతో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అనే ఈ రెండు ప్రశ్నలు అడగడం ‘కామన్’ అని అన్నారు. లాక్ డౌన్ సమయంలో తాను ఏం చేస్తున్నారో వివరించారు.  ఈ కరోనా వల్ల మనిషికి తానేంటో గుర్తుకు వచ్చింది. మనం భారత దేశంలో పుట్టాం.. అందుకే కాస్త జీవన విధానంలో ఇతర దేశాలతో పోల్చితే మార్పులు ఉంటాయి.

 

 ఇక మనం పేదరికంలో పుట్టి ఆర్భాటాలకు వెళితే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందో ప్రతి సామాన్యుడికి అర్థం అయి ఉంటుందని భావిస్తున్నాను. ఉన్ననాడు ఖర్చు పెట్టి ఈ సమయంలో బాధపడం ఎంత నరకమో అర్థం అవుతుంది.  తమ పిల్లల భవిష్యత్ గురించి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు సీరియస్ గా ఆలోచిస్తారని భావిస్తున్నాను అన్నారు. షూటింగ్ లు ఉన్నప్పుడు, లాక్ డౌన్ ఉన్నప్పుడు తాను ఒకే రకంగా ఉన్నానని, ఎందుకంటే, షూటింగ్ అయిపోతే ఇంటికి, ఇంట్లో పని అయిపోగానే షూటింగ్ కు వెళతానని, తనకు వేరే వ్యాపకాలు ఎక్కువగా ఉండవని చెప్పారు.  మరీ బోర్ కొడితే బొమ్మలు వేస్తున్నానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: