పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన అతో సినిమా అవకాశం వచ్చి ఆ సినిమా హిట్ అయితే చాలు ఇక తిరుగు ఉండదని వరుసగా ఆఫర్లు వస్తాయి అనే భావన చాలా మంది దర్శక నిర్మాతల్లో ఉంటుంది. ఆయనతో సినిమా చేయడానికి హీరోయిన్ లు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టాలీవుడ్ జనాలకు కూడా ఆయన సినిమా అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఉన్న హీరో మరొకరు లేరు అనేది వాస్తవం. అలాంటిది ఆయన తో సినిమా చేయడానికి ఒక దర్శకుడు ముందుకి రావడం లేదు. 

 

ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్... పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ ఆసక్తి చూపించి భారీ ఆఫర్ ఇచ్చినా సరే ఆయన మాత్రం సినిమా చేయడానికి ఆసక్తి చూపించ లేదు అంటారు. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అయినా సరే ఆయన తో సినిమా చేయడానికి ఎందుకు త్రివిక్రమ్ ముందుకు రాలేదు అనేది అర్ధం కావడం లేదు. క్రిష్ తో సినిమా తర్వాత తనతో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్తున్నా ఆయన మాత్రం ముందుకి రాలేదు. దీనికి కారణం ఏంటీ అనేది ఎవరికి స్పష్టత లేదు. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు దీని గురించే చర్చలు అన్ని కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ సిద్దమై ఒక సినిమాను వాయిదా వేసినా సరే ఆయన తో మాత్రం సినిమా చేయడానికి త్రివిక్రమ్ రాకపోవడం ఏంటీ అనేది ఎవరికి అర్ధం కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: