దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడ్డాయి. దీంతో మూవీ లవర్స్ టీవీలను, స్ట్రీమింగ్ యాప్ లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్ట్రీమింగ్ యాప్ లను వినియోగించే యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఓటీటీ సంస్థలు ఇటీవల విడుదలైన సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాయి. 
 
ఫిబ్రవరిలో విడుదలైన భీష్మ సినిమా రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ జంటగా నటించి హిట్ టాక్ తెచ్చుకున్న కనులు కనులను దోచాయంటే సినిమా గత వారం నెట్ ఫ్లిక్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆహా యాప్ లో కూడా అందుబాటులోకి రానున్నట్టు ఆహా సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. 
 
మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన దుల్కర్, పెళ్లిచూపులు సినిమాతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రీతూవర్మ ఈ సినిమాలో నటించారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దుల్కర్ యాప్ డెవలపర్ పేరు చెప్పుకుని వైట్ కాలర్ నేరాలు చేసే పాత్రలో కనిపించగా ఆఫీసర్ పాత్రలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నటించారు. 
 
తెలుగులో చాలా తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో రెండు మూడు వారాల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ఆహా యాప్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. తమిళంలో విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయాడతాల్ సినిమాను తెలుగులో డబ్ చేశారు. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్సైన వారు నెట్ ఫ్లిక్స్, ఆహా యాప్ ల ద్వారా వీక్షించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: