నార్త్ నుంచి టాలీవుడ్ కి వచ్చే భామలు ఇక్కడ క్లిక్ అయితే స్టార్ హీరోయిన్లు అయిపోతారు. వీరు ఇక్కడ పాగా వేయడమే కాకుండా తెలుగు భాషపై కూడా పట్టు పెంచుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్లు తెలుగు హీరోయిన్లే అనేంతగా తెలుగు మాట్లాడతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇదే చేస్తోందట. ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా పాపులర్ అయిపోయిన ఈ భామ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు మాట్లాడాలని ట్రై చేస్తోందట.

 

 

ప్రస్తుత లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటోందట. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఆశించినంత అవకాశాలు రాకపోవటానికి కారణం తెలుగుపై తనకు పట్టు లేకపోవటమేనని గ్రహించిందట. దీంతో తెలుగు భాషపై అవగాహన తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులు హీరో, హీరోయిన్లకు ఇటువంటి అవకాశాలు కల్పిస్తోంది. పాయల్ కూడా ఈ లాక్ డౌన్ పరిస్థితులను బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. రీసెంట్ గా ఆమె పేపర్ డ్రెస్సింగ్ తో ఇచ్చిన ఫోటోషూట్, దిండు కప్పుకుని చేసిన ఫోటోషూట్ ఎంతో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో పాయల్ తన రేంజ్ హాట్ నెస్ తో కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

 

 

పాయల్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు అందరూ ఏదొక వ్యాపకం పెట్టుకుంటున్నారు. సాధారణ రోజుల్లో చేయాలనుకుని చేయలేకపోతున్న తమ హాబీలను, పనులను చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అనేక రకాల ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుస్తకాలు చదవడం దగ్గర నుంచి వంటలు చేయడం, ఇంటి పనులు చేయడం చేస్తున్నారు. పాయల్ కాస్త కొత్తగా ఆలోచించి కెరీర్ కోసం తెలుగు భాషను నేర్చుకునే పనిలో ఉండటం విశేషమే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: