ప్రస్తుతం కరోనా విలయానికి దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు కాబట్టి వారూ ఇళ్లలోనే ఉంటున్నారు. కాకపోతే.. కళాకారులు కాబట్టి ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా ప్రజలను ఎంటర్ టైన్ చేయడం వారు విధిగా పెట్టుకున్నారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. మెగాస్టార్ చిరీంజీవి నుంచి దాదాపు సెలబ్రిటీలు అందరూ ఛాలెంజ్ పేరుతో ఇంటి పనులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా చేరిపోయాడు.

 

 

అయితే.. కల్యాణ్ దేవ్ విసిరింది ప్రస్తుతం వైరల్ గా మారిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ కాదు. తన చిన్ననాటి జ్ఞాపకమైన ఓ ఒకటో తరగతి ఫొటోను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి అందులో తానెక్కడున్నానో చెప్పాలని ఛాలెంజ్ విసిరాడు. విశేషమేమంటే ఈ ఫొటోలో తన శ్రీమతి శ్రీజ కూడా ఉందట. ఈ ఫొటో గురంచి చెప్తూ.. ‘ఈ ఫొటోలో నా భార్య శ్రీజ కూడా ఉంది. ఎందుకంటే మేమిద్దరం ఎల్ కేజీ, ఫస్ట్ క్లాస్ ఒకే స్కూల్లో చదివాం. పైగా ఆ రెండేళ్లు ఒకే బెంచిపై పక్కపక్కనే కూర్చున్నాం కూడా. ఈ ఫొటోలో మేమిద్దరం ఎక్కడున్నామో కనుక్కోండి’ అని ఓ మినీ ఛాలెంజ్ విసిరాడు.

 

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ వీరిద్దరూ ఎక్కడున్నారో అంటూ గుర్తు పట్టడం మొదలెట్టారు. దాదాపు 25 క్రితం పిక్ కాబట్టి గుర్తు పట్టడం కొంచెం కష్టమే అయినా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. గుర్తుపట్టి కామెంట్లు చేస్తున్నారు. ఏమైగా మెగాస్టార్ గారాలపట్టి, అల్లుడు కావడంతో రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I’m not sure how many of you know but, my wife @sreeja_kalyan and I were classmates for 2 years when we were kids, U.K.G and 1st grade. In fact, we sat beside each other for those 2 years on the first bench. . Now, try and find both of us ;) . In the frame : All my other classmates along with my Principal, Jaganmohan Rao Garu (Centre). Vice Principal - Ramadevi Mam (Right) and Class Teacher : Jagathi Mam (Left) . #FlashbackFriday #Childhood #Memories #SchoolDays #FriendsForever #Love . నేను, శ్రీజ చిన్నప్పుడు ఒకే తరగతిలో 2 సంవత్సరాలు చదువుకున్నాము. ఈ పై ఫోటోలో తనూ, నేను ఎక్కడున్నామొ కనుక్కోండి.

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: