పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హీరోగా నటించిన సినిమా అత్తారింటికి దారేది. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అవడం చిత్రయూనిట్ ను షాక్ కు గురి చేసింది. సినిమా ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అవడం అది ఆడియెన్స్ దాకా వెళ్లడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా లీక్ అవడం సినిమా రిలీజ్ కూడా ఆపేద్దామని అనుకున్నారు కానీ ఫలితం ఏదైనా సరే రిలీజ్ చేద్దామని అనుకోగా ఫైనల్ గా రిలీజైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 

 

సినిమా ఫస్ట్ హాఫ్ వరకే లీక్ అవడం.. సెకండ్ హాఫ్ లో కథనం బాగుండటంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్సినిమా హిట్టయినా సరే సక్సెస్ మీట్ జరుపుకోడానికి ఇష్టం చూపడు. కానీ అత్తారింటికి దారేది సినిమాకు మాత్రం సక్సెస్ మీట్ కావాలని జరుపుకున్నాడు. అంతేకాదు ఆ సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా మాట్లాడాడు. చచ్చిపోయింది అనుకున్న సినిమాను బ్రతికించింది మీరే అంటూ పవన్ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అన్నాడు. 

 

అత్తారింటికి దారేది సినిమా లీక్ అవడంపై సినిమా వాళ్ళే కొనరు సినిమా చూశాం బాగుందని మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారని అలాంటి వారిని చూసి తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదని అన్నాడు పవన్ కళ్యాణ్. నా వెనుకాల ఉంది మీరే.. మీరే నా పవర్ మీరు లేనిదే నేను లేనని అన్నాడు పవన్ కళ్యాణ్.                     

మరింత సమాచారం తెలుసుకోండి: