టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు మహేష్ బాబు, ముందుగా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి, చిన్నవయసులోనే తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకోవడం జరిగింది. ఆ సమయంలో చాలా సినిమాల్లో నటించిన మహేష్ బాబు, బాలచంద్రుడు సినిమా తరువాత తన చదువుల పై దృష్టిపెట్టి కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత 1999లో కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ నటి ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు మణిశర్మ అందించిన వండర్ఫుల్ సాంగ్స్ ఇప్పటికే కూడా అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. 

IHG

ఇకపోతే ఆ సినిమాతో పాటు అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలేవీ రాజకుమారుడు రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఈ సినిమా విజయవాడలోని ప్రఖ్యాత అలంకార్ థియేటర్ లో నాలుగు షోలు ఏకంగా వంద రోజులపాటు హౌస్ ఫుల్ సాధించి, ఘట్టమనేని హీరో సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఏంటో రుచి చూపించింది. కాగా ఈ సినిమా రిలీజ్ తరువాత వెంటనే మహేష్ కు అప్పట్లో బాలీవుడ్ నుండి కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. చూడడానికి అచ్చం హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని అందం, పర్సనాలిటీ కలిగిన మహేష్ బాబు, వాస్తవానికి తొలి సినిమాతోనే తన అందం, అభినయం, క్రేజ్ తో అప్పుడే పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఇప్పటికీ ఒక అసంతృప్తి మిగిలి ఉంది. ఆయన ఒక్క బాలీవుడ్ సినిమా చేస్తే చాలని వారు ఫీల్ అవుతున్నారు. 

19 Years for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH' target='_blank' title='mahesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh</a> IHG

అయినప్పటికీ ఫస్ట్ మూవీ తోనే ఆ రేంజ్ లో క్రేజ్ రావడం అనేది సామాన్యమైన విషయం కాదని, ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా వైడ్ గానే కాక అటు ఓవర్సీస్ లో సైతం మహేష్ కు ఉన్న క్రేజ్ పాన్ ఇండియా హీరోలకు మించే ఉంటుందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఆ విధంగా మహేష్ బాబు, తన ప్రతి ఒక్క సినిమాతో అమాంతం క్రేజ్ ని, ఫాలోయింగ్  ని, ఫ్యాన్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. రాజమౌళి సినిమా దాక అవసరం లేదని, ఇటీవల వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన మహేష్, మరొక రెండు సినిమాలు హిట్స్ కొడితే చాలు టాలీవుడ్ స్టార్ హీరోల్లో నెంబర్ వన్ స్థానానికి అత్యంత చేరువ అవుతారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: