పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఉత్సహంతో గంతులు వేయని అభిమాని అంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త వరవడికి నాంది పలికే వారిలో పవన్ ముందుంటారు. డైలాగ్ డెలివరీ లో పవన్ ది ప్రత్యేక స్టైల్ . ట్రెండ్ సెట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి దానికి లేదు పోటీ . పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లిన తరువాత సినిమాలు తీయడం కాస్త తగ్గించాడు. అయినప్పటికీ మరలా బాలీవుడ్ రీమేక్ తో మళ్లీ మనముందుకు రాబోతున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . జనసేన లో యాక్టీవ్  గానే ఉంటూ అటు సినిమాలను కూడా చేసేపనిలో పడ్డాడు పవన్ కళ్యాణ్. అయితే ఓ సందర్భంలో  పవన్ కళ్యాణ్ గతం లో తాను పడ్డ స్ట్రగుల్ గురించి చెప్పుకొచ్చాడు.

 

కెరీర్ ఆరంభించక మునుపు పవన్ కళ్యాణ్ గారికి ఆధ్యాత్మిక విషయాలపై  ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదట. ఆధ్యాత్మికంగా తానూ ఎంతో స్ట్రాంగ్ గా ఉండేవాడట. అయితే ఓ రోజు అన్నయ్య పిలిచి కెరీర్ గిరిచి ఏం చేయాలనుకుంటున్నావు  అని అడిగాడు ..దానికి సమాధానంగా అందరికి ఆధ్యాత్మికత గురించి బోధించాలనుకుంటున్నాను అని చెప్పను ...దానికి అన్నయ్య చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటె ఎన్నైనా చెబుతావు రా అని ..సరదాగా చెప్పేసి వెళ్ళిపోయాడు.

 

 

నా కెరీర్లో మంచి హిట్ అందుకున్న సినిమా ఖుషి. ఖుషి సినిమా రిలీజ్ కు ముందు నా కెరీర్ గురించి చాల భయపడ్డాను. కానీ తరువాత సినిమా హిట్ అవ్వడం తో ఊపిరిపీల్చుకున్నాను. ఆ సినిమా తరువాత మంచి హిట్ దొరక్క చాల ఇబ్బంది పడ్డాను కానీ చివరికి గబ్బర్ సింగ్ ద్వారా అటువంటి విజయాన్నే అందుకున్నాను . గబ్బర్సింగ్  షూటింగ్ అప్పుడు పోలీస్ స్టేషన్ లో అంతాక్షరి సీన్ చేసేటప్పుడు ఆ చైర్ పై కూర్చున్నప్పుడు నా జాతకం నాకు తెలిసిపోయింది. సినిమా రిలీజ్ తరువాత మంచి హిట్ అందుకుంది .మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. ఆతరువాత హిట్ సినిమాలు చేసే అవకాశం నాకు కలిగింది ...

మరింత సమాచారం తెలుసుకోండి: