సిని ఇండస్ట్రీలో నిలదొక్కు కోవాలంటే ఎంతో కొంత ఫ్యామిలి బాగ్రౌండ్ ఉండాలి. కాని ఎలాంటి సపోర్ట్ లేకుండా తమ కంటూ ఒక ఇమేజ్ ని సెట్ చేసుకున్నారు నాని, విజయ్ దేవర కొండ. ప్రస్తుత జనరేషన్ ని ఆకట్టే విధంగా వీరి సినిమాలు ఉంటాయి. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఎవరి స్టైల్లో వారు కష్టపడుతూ కొనసాగుతున్న వీరు ఇప్పుడు పెద్ద దర్శకులతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అపజయం లేని డైరెక్టర్ కొరటాలతో సినిమా చేయడానికి వీరు సన్నద్ధం అవుతున్నారు.

 

కొరటాల శివ ఈ పేరు వినగానే మెగా అభిమానులు ఇట్టె గుర్తు పట్టేస్తారు. చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా తర్వాత కొరటాల ఈ తరం వారి కోసం మంచి రొమాంటిక్ అండ్ ఎమోషనల్ కథను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆ కొత్త కథల కోసం నాని, విజయ్ దేవరకొండ వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశo ఉన్నట్టు సిని వర్గాల కథనం. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే పరిశ్రమలో అనేక రూమర్స్ హల చల్ చేస్తున్నాయి.

 

కొరటాల సినిమా అంటే ఎలాంటి హీరో అయినా ఒకే చెప్తారు. ఆ మధ్య కొరటాల మల్టి  స్టారర్ మూవీ చేసే చాన్స్ ఉందని పుకార్లు వచ్చాయి. కాని అటువంటి ఆలోచన కోరటాలకు ఏ మాత్రం లేదని స్పష్టమౌతుంది. అయితే నాని తో కాని లేదా విజయ్ తో కాని ఒక సినిమా చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హీరోలు, డైరెక్టర్లు కూడా తమ వర్క్ ఇంప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త తరహా కథలకు పదును పెడుతున్న కొరటాల స్క్రిప్ట్ రెడీ చేసి ఆచార్య తరువాత ఎనౌన్స్ చేసే అవకాశo  కనిపిస్తుంది. మరి కొరటాలతో పనిని ఎవరు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: