మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురములో” సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి అదిరిపోయే విజయాన్ని సాధించింది. బన్నీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో పాటు మలయాళంలో కూడా విడుదలైన ఈ సినిమా  అక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. మామూలుగానే అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. తాజాగా మలయాళంలో ఈ సినిమాతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. పూర్తి మేటర్ లోకి వెళ్తే  ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కావటంతో  బన్నీ సినిమా కు ఊహించని టి.ఆర్.పి రేటింగ్స్ నమోదయ్యాయి.

 

బన్నీ సినిమా మలయాళ వెర్షన్ “అంగు వైకుంఠపురతు” సినిమాను గత కొన్ని వారాల క్రితం టెలికాస్ట్ చెయ్యగా 11.17 టీఆర్పీ రేటింగ్ సాధించింది. దాని తర్వాత ఇటీవలే విడుదలైన “మమాంగం” అక్కడ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం టెలికాస్ట్ కాగా 7.12 టీఆర్పీ రాగా అక్కడ మరో స్టార్ హీరో పృథ్వీ రాజ్ నటించిన “డ్రైవింగ్ లైసెన్స్” చిత్రం భారీ హిట్ అయ్యింది. ఈ చిత్రం కూడా టెలికాస్ట్ కాగా దీనికి 10.05 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కానీ బన్నీ నటించిన సినిమా టిఆర్పి రేటింగ్స్ ని ఏది దాటించ లేకపోయింది.

 

మలయాళం లో ఉన్న స్టార్ హీరోలకు ప్రస్తుతం బన్నీ తన క్రేజ్ తో చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో అల్లు అర్జున్ కేరళ రాష్ట్రానికి 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కేరళ సీఎం బన్నీని మెచ్చుకున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: