మెగాస్టార్ చిరంజీవి కి రౌడి అల్లుడు సినిమా ఎంతటి పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. కళ్యాణ్ గా, ఆటో జానీ గా డ్యూయల్ రోల్ లో చిరంజీవి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆటో జాని పాత్ర మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇదే టైటిల్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చిరంజీవి తో రీ ఎంట్రీ మూవీ తెరకెక్కించాలని కథ రాసిన సంగతి తెలిసందే. ఈ కథ చిరంజీవి, నాగ బాబులకు నచ్చినప్పటికి కథలో సెకండాఫ్ చిరంజీవి కి అంతగా నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే పూరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి విజయవంతం గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంతేకాదు పూరి ఇండస్ట్రీకొచ్చి సక్సస్ ఫుల్ గా 20 ఏళ్ళు కంప్లీటయింది.

 

ఈ 20ఏళ్ళలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరికి తీరని కోరికగా మిగిలింది మాత్రం అన్నయ్య మెగాస్టార్ ని డైరెక్ట్ ఛాన్స్ రాకపోవడమే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వాటిలో ముందు లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక నెక్స్ట్ సినిమాలు బాబి, మెహర్ రమేష్ దర్శకత్వంలో ఉండనున్నాయట. 

 

అంతేకాదు మెగాస్టార్ అనుకుంటున్న యంగ్ డైరెక్టర్స్ జాబితాలో హరీష్ శంకర్, పరశురాం, సుకుమార్, మెహర్ రమేష్ ..ఇలా చాలా మంది డైరెక్టర్సే ఉన్నారు. కాని చిరంజీవి అనుకుంటున్న లిస్ట్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేకపోవడం. ఈ మధ్య చెప్పిన పేర్లలో కూడా చిరంజీవి పూరి జగన్నాధ్ పేరు ప్రస్తావించకపోవడం కూడా కొంతమంది బాగా ఫీలవుతున్నారు.

 

అందుకు కారణం మెగాస్టార్ ని ఊర మాస్ గా అద్భుతంగా చూపించగల సత్తా ఒక్క పూరి జగన్నాధ్ కి మాత్రమే ఉందన్న నమ్మకం. దాంతో ఎలాగైనా మీరు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా చేయాలన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారట. మరి అన్నయ్యకి పూరి తో సినిమా చేసే ఇంట్రెస్ట్ ఎప్పుడొస్తుందో చూడాలి. ఒకవేళ అదే గనక జరిగితే ఇండస్ట్రీలో మరో రికార్డ్ నమోదవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: