టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. ఇక ప్రస్తుతం చేస్తున్న ఆచార్యతో ఎలాగైనా మంచి హిట్ కొట్టి తన ఫ్యాన్స్ ని మంచి ఖుషి చేయాలని భావిస్తున్న మెగాస్టార్, ఈ సినిమా తరువాత ఇటీవల మలయాళం లో సూపర్ హిట్ కొట్టిన లూసిఫర్ సినిమా తెలుగు వర్షన్ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. 

 

ఇటీవల ఈ సినిమా హక్కులను ఆయన తనయుడు రామ్ చరణ్ అత్యధిక ధరకు కొనుగోలు చేయడం జరిగింది. కాగా ఈ సినిమాకు సాహో చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించే అవకాశము ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ అన్నారు. ఇక దీని తరువాత యువ దర్శకుడు బాబీ తో పాటు మరొక దర్శకుడు మెహర్ రమేష్ తో కూడా తన తదుపరి సినిమాలు చేసే అవకాశము ఉందని అన్నారు మెగాస్టార్. అయితే టాలీవుడ్ లో ఎప్పటినుండో కొన్ని కొన్ని కాంబినేషన్స్ పై ఎప్పడూ కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. కాగా అటువటి క్రేజీ కాంబినేషన్ మెగాస్టార్, బోయపాటిది. వాస్తవానికి మంచి మాస్ సినిమాలు తీయడంలో దిట్టగా పేరు గాంచి బోయపాటి శ్రీను, తన సినిమాలో హీరోలు, విలన్లను ఎంతో భారీ లెవెల్లో మాస్ రేంజ్ లో చూపిస్తూ ఉంటారు. 

 

ఇక ముఖ్యంగా బోయపాటి సినిమా కనుక వర్కౌట్ అయితే అది మాస్ లోకి విపరీతంగా చొచ్చుకునిపోతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఆ విధంగా ఆయన తీసిన సినిమాల్లో భద్ర, సరైనోడు, లెజెండ్, సింహా సినిమాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మెగాస్టార్ మాస్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో పలు మాస్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు భారీ విజయాలు అందుకున్న మెగాస్టార్ కనుక ఒక్కసారి బోయపాటి తో కలిసి సినిమా చేస్తే నిజంగా ఆ సినిమా అలాంటిలాంటి విజయం కాదు, భారీ విజయం అందుకోవడం ఖాయం అని అంటున్నారు మెగాఫ్యాన్స్. మరి వీరిద్దరి క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి..... !!!

మరింత సమాచారం తెలుసుకోండి: