టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు చిన్న వయసులో బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న మహేష్ బాబు, హీరోగా నటించిన తొలి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇక ఆ తరువాత నుండి తన ఆకట్టుకునే నటనతో వరుసగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. 

 

ఇకపోతే మహేష్ బాబు సినిమా కెరీర్ ని ఒకసారి పరిశీలిస్తే, ఆయన దాదాపుగా చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు ఉంటాయి అని చెప్పడం లో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక మొదటి నుండి కొంత డిఫరెంట్ గా తన కెరీర్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగిన సూపర్ స్టార్, ఫస్ట్ సినిమా అంతపెద్ద హిట్ కొట్టినప్పటికీ కూడా, ఏ మాత్రం ఆలోచించకుండా డేరింగ్ గా రెండవ సినిమాలోనే నాలుగేళ్ళ బిడ్డకు తండ్రిగా నటించి ఆ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు పూర్తి స్థాయి ప్రేమ కథలో గాని, అలానే పూర్తి స్థాయి మాస్ సినిమాలో గాని మహేష్ నటించలేదు అనే చెప్పాలి. ఇక వీటన్నిటికంటే కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కెరీర్ లో అతి పెద్ద విజయాలు అందుకున్న సినిమాల్లో చాలావరకు మంచి సందేశాన్ని అందించే సినిమాలు ఉండడం గమనార్హం. అప్పట్లో వచ్చిన శ్రీమంతుడు గాని, ఆ తరువాత వచ్చిన భరత్ అనే నేను గాని, లేదా మొన్నటి మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు అటువంటివే. ఇక తన కెరీర్లో అక్కడక్కడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలతో విజయాలు అందుకున్న మహేష్, ఎక్కువగా తన సినిమాలు ఫలానా వర్గం మాత్రమే కాక అన్ని వర్గాల వారు చూడాలని భావిస్తుంటారట. 

 

ఇక ఇటీవల నటి శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, మీకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కి మీరు కనుక ఇప్పటికిప్పుడు మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేస్తే కోట్లాది రూపాయల కలెక్షన్ వస్తుంది కదా, మరి మీరు ఎందుకు చేయడం లేదు అని మహేష్ ని అడుగగా, తనకు మంచి క్వాలిటీ ఉన్న సినిమాలనే ప్రేక్షకులకు అందించని కోరిక అని, అందుకే ఎక్కువగా మాస్ సినిమాల పై దృష్టిపెట్టలేదని మహేష్ అన్నారని శృతి చెప్పడం జరిగింది. నిజంగా ఈ విధమైన ప్రత్యేకత మన టాలీవుడ్ సూపర్ స్టార్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో కూడా ఆయన ఈ తరహా సినిమాలు చేసి మనల్ని అలరించాలని ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కోరుతున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: