బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి గానూ బాలీవుడ్ లో టాలీవుడ్ లో కూడా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఆయన నటనకు ఫాన్స్ కాకపోయినా ఆయన చేసిన సినిమా బాహుబలి కి మాత్రం భారీగా ఫాన్స్ ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఆయనతో సినిమా చేస్తే భారీ వసూళ్లు వస్తాయి అనేది చాలా మంది నిర్మాతల అభిప్రాయం. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక కాంబినేషన్ టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. 

 

అది ఏంటీ అంటే... రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, మహేష్ బాబు కలిసి ఒక సినిమా చెయ్యాలని. ఆ సినిమాలో మహేష్ బాబు కి విలన్ గా ప్రభాస్ నటిస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ మాస్ గా కనిపించే అవకాశం ఉంటుంది. మహేష్ బాబు క్లాస్ గా కనపడతాడు. వీళ్ళ మధ్య ఫైట్ సీన్ ఉంటే ఎలా ఉంటుంది... అది చాలా మంది ఊహకు అందే అవకాశం ఉండదు గాని ఆ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు 

 

సినిమా వస్తుంది అని ఎప్పుడో అన్నారు గాని అది సెట్స్ మీదకు మాత్రం వెళ్ళే విధంగా కనపడలేదు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఈ సినిమాను చేసే అవకాశం ఉందని అన్నారు గాని అది నిజం కాదు. కాని ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది. అప్పుడు వీరి అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: