రాజమౌళి కీర్తి ఒకచరిత్ర తెలుగుసినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ తో ప్రపంచ వ్యాప్తంగా చాటిన రాజమౌళికి ఎన్నో సత్కారాలు బిరుదులు వచ్చాయి. అలాంటి వ్యక్తిని కేవలం ఒకే ఒక్క సినిమా అదికూడ ఒక భయంకరమైన  ఫ్లాప్ సినిమా తీసిన ఒక యంగ్ డైరెక్టర్ చాల ఘోరంగా విమర్శిస్తూ ఏకంగా రాజమౌళికి బహిరంగ లేఖ వ్రాసి ఒకరోజు గడుస్తున్నా ఈ లేఖ వ్రాసిన దర్శకుడి అభిప్రాయాలను ఖండిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కానీ రాజమౌళికి ఎంతో సన్నిహితులైన టాప్ హీరోలు ప్రభాస్ జూనియర్ చరణ్ లు కనీసం ఆ యంగ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇవ్వకపోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది.   

 

గత సంవత్సరం  ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ హీరోలుగా ‘మిఠాయి’ అన్న సినిమాను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ కుమార్ రాజమౌళికి బహిరంగ ఉత్తరం వ్రాసిన విషయం తెలిసిందే. ఈమధ్య రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘పారాసైట్‌’ చూశానని అయితే ఆ సినిమా చూస్తుండగానే తనకు నిద్ర వచ్చిందని తనకు పెద్దగా ఆమూవీ నచ్చలేదు అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాను నిద్రలేచిన తరువాత తన భార్య తనకు ఆమూవీ కథ చెప్పినా తనకు నచ్చలేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో కామెంట్ చేసాడు. 

 

రాజమౌళి యధాలాపంగా అన్న మాటలు దర్శకుడు ప్రశాంత్ కుమార్ చాల సీరియస్ గా తీసుకుని ఆస్కార్ అవార్డు సినిమా చూస్తూ నిద్రపోయాను అని చెప్పడం రాజమౌళికే చెల్లింది అని కామెంట్స్ చేస్తూ కాపీ సీన్స్ తీసే రాజమౌళి లాంటి దర్శకులకు ఒరిజినల్ సినిమాలు నచ్చవా అంటూ ప్రశాంత్ కుమార్ రాజమౌళిని టార్గెట్ చేస్తూ చాల ఘోరంగా విమర్శలు చేసాడు. అంతేకాదు రాజమౌళి తీసిన ‘సై’ మూవీ దగ్గర నుండి జక్కన్న తీసిన అనేక సినిమాలలో కాపీ సీన్స్ ఉన్నాయి అంటూ చురకలు అంటించాడు. 

 

ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు దర్శకుడు ప్రశాంత్ కుమార్ చేసినా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులు కాని జక్కన్న కు ఎంతో సన్నిహితంగా ఉండే ప్రభాస్ జూనియర్ లు ఖండించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే రామ్ చరణ్ కూడ పట్టించుకోకపోవడం మరింత షాకింగ్ గా మారింది. అయితే కొందరు ఈ విషయానికి వేరే విధంగా వివరణ ఇస్తున్నారు. ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ అనాలోచితంగా చేసిన కామెంట్స్ కు ప్రాముఖ్యత ఇచ్చి ఆ ఫెయిల్యూర్ డైరెక్టర్ ను హీరో చేయడం ఇష్టం లేక ఇలా అందరు మౌనం వహించి ఉంటారు అంటూ అనేకమంది అభిప్రాయపడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: