మెగాస్టార్‌ చిరంజీవి కామెడీ టైమింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ హీరోగా కెరీర్‌ ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే కామెడీ సినిమాలతో ఇరగ దీశాడు మెగాస్టార్‌. కమర్షియల్ సినిమాల్లోనూ కామెడీ పండించటంలో మెగాస్టార్ రేంజే వేరు.  రీ ఎంట్రీ రెండు సినిమాలు మాత్రమే చేసిన చిరు, ఆ రెండు సినిమాల్లో పూర్తి స్థాయిలోనూ పూర్తి స్థాయిలో కామెడీ పండించే అవకాశం రాలేదు. చిరు ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో అవుట్ అండ్‌ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ తీయగలిగే దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. మూసలో కొట్టుకుపోతున్న మహేష్ బాబు లాంటి హీరోను కూడా కామెడీ ట్రాక్‌ ఎక్కించిన స్పెషలిస్ట్ అనిల్‌. ఇటీవల సరిలేరునీకెవ్వరు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న అనిల్ త్వరలో ఎఫ్‌3ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్‌.

 

ఇమేజ్‌కు, కామెడీ టైమింగ్‌ కు తగ్గ కథ అనిల్ మాత్రమే డీల్‌ చేయగలడని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి చిరు లిస్ట్ లో అనిల్ లేడు. కానీ అనిల్ అనుకుంటే చిరు, ఛాన్స్‌ ఇవ్వడానికి పెద్దగా ఆలోచించకపోవచ్చు. వ్యక్తిగతంగా తనకు కూడా కామెడీ సినిమాలు చేయటం చాలా ఇష్టమని చిరు చాలా సార్లు చెప్పాడు. అందుకే సరైన కథతో వెలితే అనిల్‌ తో సినిమా చేయడానికి చిరు రెడీ అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. మరి అభిమానుల కోరిక మేరకు ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్ అవుతుందేమో చూడాలి. ఒక వేళ అదే జరిగి చిరు.. చంటబ్బాయి టైంలో చేసిన స్థాయి కామెడీ సీక్వెన్స్‌లను మరోసారి తెర మీద చూసే అవకాశం దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: