సినిమా అనేది రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో అన్ని రంగులు అందరి మీద పడవు. చాలా మంది నటీనటులు ఈ రంగుల ప్రపంచంలో స్థిరపడడానికి చాలా కష్టపడతారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఇక అమ్మాయిలకైతే మరెన్నో కష్టాలు ఎదిరవుతుంటాయి. అయితే అందరికీ అలాగే ఉంటుందని చెప్పలేం. అదృష్టం తలుపు తట్టే వరకు ప్రతీ ఒక్కరూ కష్టపడాల్సిందే.

 


సీరియళ్లలో నటించి వెండితెర మీద మెరిసిన రాగిణి అందరికీ గుర్తుండే ఉంటుంది. అమృతం సీరియల్ లో ఆంజనేయులు భార్యగా ఆమె కనిపించింది. ఆ ఒక్కటే కాదు ఇప్పటి వరకు ఆమె ౫౦౦కి పైగా సీరియళ్లలో నటించింది. ౨౦౦వరకు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె ఎన్ని కష్టాలు పడిందో చెప్పుకొచ్చింది. రాగిణితో కలిపి అక్కా చెల్లెళ్ళు మొత్తం ౧౩ మంది. రాగిణి ౧౨వ సంతానం .

 

మొదట్లో చిన్న చిన్న డాన్స్ గ్రూపులో పాల్గొనేదట. అప్పుడు నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చేవారు. అయితే రాగిణికి ౧౨వ ఏటనే వివాహం జరిపించారు వారి పెద్దలు. వివాహం జరిగాక సంవత్సరానికే ఒక కొడుకు పుట్టాడు. వివాహబంధం ఎక్కువ రోజులు నిల్వలేకపోయిందట. దాంతో ఆ  బంధాన్ని తెంపేసుకుని అప్పటి నుండి ఒంటరిగానే జీవితం సాగిస్తుంది రాగిణి. అయితే తన కొడుకు అక్క పిల్లలతో పెరిగాడట.

 

 

దాంతో రాగిణిని అక్కా అని పిలిచేవాడట. కొడుకుని చదివించడానికి చాలా కష్టాలు పడిందట.  ప్రస్తుతం తన కొడుకు జర్మనీ ఉంటూ సాఫ్ట్ వేరే ఉద్యోగం చేసుకుంటున్నాడట. తనని బాగా చూసుకుంటున్నాడని చెప్పింది. అయితే ఇండస్ట్రీలో మనం ఎలా ఉంటున్నాం అన్న దాన్నిబట్టే ఇతరులు మనతో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుందని చెప్పింది. రాగిణియే కాదు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విషాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: