హీరోనా , విలన్,  గెస్ట్ రోల్ ..ఇలా ఏది పడితే అది..ఏ ఆఫర్ వస్తే అది ..  ఇమేజ్ తో సంబందం లేకుండా  రౌండప్ చేసి చేసేస్తూ..ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేసేస్తున్నాడు. హీరోలుఎవరైనా ఫస్ట్ హీరోగా ….ఫేడవుట్ అయ్యాక విలన్.. దానికి కూడా టైమ్ అయిపోయాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ..అదికూడా కుదరకపోతే..గెస్ట్ రోల్స్  చేస్తారు. బట్.. విజయ్ సేతుపతి మాత్రం..అవేం చూసుకోడు.

 

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్..నో మ్యాటర్ వాట్...సినిమాలో మాత్రం నటించాలి, స్క్రీన్ మీద తప్పకుండా కనిపించాలి.. ఇలానే ఆలోచిస్తాడు తమిళ్ యాక్టర్  విజయ్ సేతుపతి. స్క్రీన్ స్పేస్ చూసుకోడు.. పెద్ద సినిమానా..పెద్ద సినిమానా అని ఆలోచించడు. క్యారెక్టర్ నచ్చితే చాలు.. అది ఎలాంటి పాత్రైనా నో చెప్పకుండా నటించేస్తాడు. హీరో, విలన్ అన్న తేడా లేకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి.

 

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. హీరోగానేకాకుండా విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఉప్పెన సినిమాలో విలన్ గా పరిచయం అవుతున్నాడు.  అంతేకాదు.. గెస్ట్ రోల్స్ , స్పెషల్ అప్పియరెన్స్ లు కూడా చేస్తున్నాడు. తమిళ్ లో సమంత , రమ్యకృష్ణ, ఫర్హాద్ నటించిన సూపర్ డీలక్స్ సినిమాలో ట్రాన్స్ జెండర్ గా సూపర్ పర్ ఫామెన్స్ ఇచ్చాడు. పేట సినిమాతో పాటు ,సైరా సినిమాలో రాజాపాండి గా.. స్పెషల్ రోల్ తో అలరించాడు.

 

ఇలా విలన్ గా చేస్తూనే.. స్పెషల్ అప్పియరెన్సులు చేస్తున్నాడు. మళ్లీ హీరోగా సోలో సినిమాలు కూడా చేస్తున్నాడు. 96 తో హీరోగా సూపర్ సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి..క్యారెక్టర్లు చేస్తూనే..మళ్లీ హీరోగా సినిమా చేశాడు. సంఘతమిళన్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇలా... ఇమేజ్ తో సంబందం లేకుండా యాక్టింగ్ కి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తూ.. జస్ట్ స్క్రీన్ మీద కనిపించి మంచి పర్ ఫామెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు విజయ్ సేతుపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: