టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చెయ్యాలి అని ఎప్పటి నుంచో దీనిపై వార్తలు వస్తున్నా సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. టాలీవుడ్ లో జనాలకు ఏదైనా కొత్తగా అందించాలని భావించే నిర్మాతలు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మాత్రం ముందుకు రావడం లేదు. త్రివిక్రమ్ ముందుకు వచ్చినా సరే  హీరోలు ఇద్దరూ ముందుకి రావడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే చాలు అనుకుంటున్నారు. 

 

సుబ్బిరామి రెడ్డి ఎప్పుడు దీని గురించి ప్రకటన చేసినా సినిమా మాత్రం ముందుకి వెళ్ళే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. పవన్ కళ్యాణ్ ముందుకు రాలేదు అని ఒకసారి చిరంజీవి ముందుకు రావడం లేదు అని ఒకసారి ఏదోక విధంగా వార్తలు వస్తున్నాయి గాని సినిమా మాత్రం ముందుకి వెళ్ళే అవకాశాలు అసలు కనపడటం లేదు. ఈ సినిమాను నిర్మిస్తే నిర్మాతలకు లాభాల పంట అనేది చాలా మంది చెప్పే మాట. ఇక ఈ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎలా నటించాలి అనేది కూడా చాలా మంది అభిమానులు చర్చిస్తూ ఉంటారు. 

 

చిరంజీవి ఈ సినిమాలో పెద్దన్న గా కాకుండా మావయ్య గా పవన్ కళ్యాణ్ కి నటిస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిమానుల మనసులో మాట. మామా అల్లుళ్ళు గా వీరు ఇద్దరూ నటిస్తే కొత్తగా ఉంటుందని చివర్లో చిరంజీవి ని పవన్ కళ్యాణ్... కీర్తిస్తూ ఒక సీన్ ప్లాన్ చెయ్యాలని భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నా సరే దర్శక నిర్మాతలు మాత్రం ముందుకి తీసుకుని వెళ్ళే ఆలోచన చేయడం లేదు. ఈ సినిమాకు మార్కెట్ ఎక్కువగా ఉంటుంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: