రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి ౮వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. లాక్డౌన్ ఎత్తేసిన అనంతరం ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మరీ సినిమా షూటింగ్ కంప్లీచే చేస్తారట.

 

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ గా రూపొందిస్తున్నారు. వేను శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. కరోనా విజృంభణ వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే కరోనాని నియంత్రించిన తర్వాత కూడా షూటింగ్ కి ఎప్పుడు అనుమతులిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

 

నిజానికి ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో జనాల్లో బాగా హైప్ ఉంటుందని ఆ విధంగా డిసైడ్ అయ్యాడు. కానీ కరోనా రక్కసి ఆ ప్లాన్ లన్నింటినీ తారుమారు చేసింది. దీంతో వకీల్ సాబ్ ని ఎప్పుడు విడుదల చేయాలో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు దసరాకి విడుదల చేస్తారని వార్తలు వచ్చినా, తాజాగా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

అయితే సంక్రాంతి ఆర్.ఆర్.ఆర్ విడుదల ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆర్.ఆర్.ఆర్ కి పోటిగా దిగుతారా అనే ఆసక్తి మొదలైంది. అయితే దిల్ రాజు లెక్కల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ సంక్రామ్తి బరి నుమ్డి తప్పుకునే అవకాశం ఉందట. అన్నీ కుదురుకుని ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కావాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుందని భావిస్తున్నాడు. అందుకే వకీల్ సాబ్ ని సంక్రాంతి బరిలో దించాలని అనుకుంటున్నాడట. మరి ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడే వరకు ఏదీ నమ్మలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: