తెలుగు చిత్ర పరిశ్రమలు త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన పంచ్ డైలాగులతో సినిమా మొత్తం ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించగల సత్తా త్రివిక్రమ్ సొంతం అని చెప్పాలి. తనదైన యాస ప్రాసతో కూడిన పంచు డైలాగ్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన డైలాగ్ లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచి పోయాయి. కేవలం పంచు డైలాగ్ లకు మాత్రమే పరిమితం కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఎన్నో అద్భుతమైన డైలాగులు కనిపిస్తూ ఉంటాయి త్రివిక్రమ్ సినిమాలలో . అందుకే త్రివిక్రమ్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 

 

 అయితే దాదాపు గా ఇప్పటివరకూ అందరు హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేశాడు అనే విషయం తెలిసిందే. కానీ కొంత మంది హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు  ఊహించుకుంటే మాత్రం అవి క్రేజీ కాంబినేషన్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి  త్రివిక్రమ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్. మామూలుగానే పవర్ఫుల్ హీరోఇజానికి  పెట్టింది పేరు బాలకృష్ణ. పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చెప్పడంలో తనకు తానే సాటి అని చెప్పుకోవచ్చు. అలాంటిది త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో బాలయ్య సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మాత్రం ఊహకందని విధంగా ఉంటుంది. ఎందుకంటే సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఊహించని కాంబినేషన్ ఇది. 

 

 

 ఓవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాస యాసతో కూడిన పంచ్ డైలాగులు... పంచు డైలాగులు అద్భుతంగా డెలివరీ చేసే బాలకృష్ణ చెబుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది. అందుకే నందమూరి అభిమానులు కూడా త్రివిక్రమ్ బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఏ రేంజ్లో ఉంటుంది అని ఊహించుకుంటూ ఉంటారు. నిజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అది బొమ్మదద్దరిల్లిపోతుంది అని చెప్పవచ్చు. మరి ప్రేక్షకులు ఊహించిన విధంగా కోరుకున్న విధంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అన్నది మాత్రం అందరికీ ఊహాగానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: