మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అక్కినేని నాగార్జున వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో కూడా సినిమా రావాల‌ని ఫ్యాన్స్ తెగ ఉర్రూత‌లూగుతున్నారు. ఇక రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే మ‌గ‌ధీర లాంటి ఒక హై బ‌డ్జెట్ సినిమాను తీసుకుంటే అందులో నాగార్జున వ‌చ్చేసి రామ్‌చ‌ర‌ణ్‌కి తండ్రి పాత్ర‌లో న‌టిస్తే చాలా బావుంటుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లేదంటే మ‌గ‌ధీర చిత్రంలో శ్రీ‌హ‌రి క్యారెక్ట‌ర్ లాంటి పాత్ర‌లో న‌టిస్తే బావుంటుంది.  అలాగే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రంలో బంగారు రాజు పాత్ర‌లో న‌టిస్తే ఆ ర‌క‌మైన కాంబినేష‌న్ కూడా బాగానే ఉంటుంది. రామ్‌చ‌ర‌ణ్‌ని అమాయ‌కంగా క‌నుక చూపిస్తే అలాంటి అమాయ‌క‌పు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ ని చూపిస్తే బావుంటుంది. అంటే సోగ్గాడే చిన్నినాయ‌నా లాంటి స్టోరీ  తీసుకుని వీరిద్ద‌రూ తండ్రీ కొడుకులుగా చేస్తే ఎలా ఉంటుంది. అంటే ఒక మాస్ ఫాద‌ర్ అమాయ‌క‌పు కొడుకు అలాంటి పాత్ర‌ల‌యితే బావుంటాయి.

 

ఇలాంటి స‌బ్జెక్ట్ అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో బావుంటుంది. అలాగే చ‌ర‌ణ్ కూడా కొంచం అలాంటి అమాయ‌క‌పు పాత్ర‌లో న‌టిస్తే బావుంటుంది. గ‌తంలో ఆయ‌న న‌టించిన ఆరెంజ్ చిత్రంలో అలాంటి పాత్రే ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ లాక్‌డౌన్ కార‌ణంగా ఆయ‌న న‌టిస్తున్న ఆర్‌.ఆర్.ఆర్ చిత్రానికి బ్రేక్ ప‌డింది. పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. దాంతో ఇంట్లో ప‌నుల‌న్నీ చేస్తూ వాటిని వీడియో తీస్తూ సెల‌బ్రెటీలు ఇస్తున్న ఛాలెంజ్‌ని తీసుకుని ఇంటిప‌నుల‌న్నీ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోలు తీస్తూ ఫ్యాన్స్‌కి ద‌గ్గ‌ర‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 

 

ఇక నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్త‌యింది. అది కూడా క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది. లేదంటే ఈ పాటికి ఆ చిత్రం విడుద‌ల‌య్యేది. ఇక ఈ చిత్రం నాగార్జున చాలా సైలెంట్‌గా షూటింగ్‌ని పూర్తి చేశారు. ఈ లాక్‌డౌన్ పూర్త‌వ‌గానే మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అఖిల్, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ సినిమా షూటింగ్ ప‌నుల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: