గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాల్లో హీరోలు పాటలు పాడటం కామన్ అయిపోయింది. చిరంజీవి నుండి మొదలుకుని చాలా మంది హీరోలు పాటలు పాడారు. మెగాస్టార్ మృగరాజు సినిమా కోసం చాయ్ మీద పాట పాడి అభిమానులని అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుతో పాటు వేరే భాషలో కూడా పాట పాడి ఔరా అనిపించాడు. అయితే హీరో పాడిన పాటలు చాలా పాపులర్ అవుతుంటాయి.

 

అలా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఇప్పటికీ ఫేమస్సే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో పాట పాడాలని కోరుకోక ముందే ఖుషీ సినిమాతో వారికి ఆనందాన్ని ఇచ్చేశాడు. ఎస్ జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒకానొక శ్రీకాకుళం జానపదం పాడాడు. హీరోయిన్ తో విడిపోయినపుడు తన ఫ్రెండ్ ఆలీతో మందు తాగుతూ బాధలు చెప్పుకుంటున్న సమయంలో బై బయ్యే బంగారు రమణమ్మ.. బావి చెరువు కాడ బోరింగు రమణమ్మ.. అనే పాట పాడి అందర్నీ నవ్వించాడు.

 


సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో పవన్ పాడిన ఆ పాట కూడా అంత బ్లాక్ బస్టర్ అయింది. కామెడీ సిట్యుయేషన్ లో వచ్చిన ఆ పాట అభిమానులని ఉర్రూతలూగించింది. అయితే అదొక్కటే కాదు అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందాన్ని ఆడుకునే సమయంలో కాటమరాయుడా కదిరి నరసింహుడా అనే పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఆ పాటలో పవన్ వేసిన స్టెప్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు.

 


అయితే అదే ఆనందాన్ని మరోసారి పంచుదామనుకుంటే సినిమా ఫెయిల్యూర్ కావడంతో పాట జనాల్లోకి వెళ్లకుండా పోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వర్రావు పాట బాగున్నప్పటికీ, అత్తారింటికి దారేదిలోని కాటమరాయుడు పాట సిట్యుయేషన్ తో పోలిక ఉండడంతో జనాలకి రీచ్ కాలేకపోయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పాట పాడినా అభిమానులకి వచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా జానపదాలు పవన్ గొంతు నుండి వస్తే మరింత కిక్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: