తెలుగు చిత్ర పరిశ్రమలో అటు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించటం  తో పాటు ఇటు క్లాస్ ప్రేక్షకులను కూడా బాగా అలరించి  మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రేక్షకుల రెబల్ స్టార్ గా మారిపోయిన హీరో ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ ఏ చెప్పిన విన సొంపుగా వుంటుంది.. ఇక ప్రభాస్ యాక్షన్ అయితే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనే చెప్పాలి. లవర్ బాయ్ గా అయినా... మాస్ యాక్షన్ లో అయినా.. ఎందులో అయిన ప్రభాస్  ఒదిగిపోయి మరి నటిస్తూ ప్రభాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. అయితే దాదాపుగా ప్రభాస్ చాలా మంది దర్శకులతో సినిమాలను తీశారు. 

 

 

 అయితే రెబల్ స్టార్ ప్రభాస్ తో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్  గా ఉండే దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా తీస్తే మాత్రం అది  ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. మామూలుగానే బోయపాటి శ్రీను సినిమాలు అంటే హీరోయిజం బాగా ఉంటుంది. బోయపాటి సినిమాలలో హీరోలు విలన్లను చితకబాదుతూ  ఉంటారు. ముఖ్యంగా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి బోయపాటి సినిమాల్లో . ఇక అటు ప్రభాస్ కూడా యాక్షన్ సీన్లలో ఇరగదీస్తాడు అన్న విషయం తెలిసిందే. అలాంటిది బోయపాటి రెడీ చేసిన స్క్రిప్టులో... ప్రభాస్ నటిస్తే ఆ యాక్షన్ కి ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటారు అని చెప్పాలి. 

 

 

 ఎందుకంటే ఆరడుగుల అందగాడైన ప్రభాస్ ఆరు పలకల దేహంతో యాక్షన్ సీన్లలో ఇరగదీస్తూ  ఉంటే సినీ ప్రేక్షకులు అందరూ ఈలలు గోలలు  చేయక మానరు. అలాంటిది పవర్ఫుల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే దర్శకుడు బోయపాటితో ప్రభాస్ సినిమా తీస్తే ఇక ఆ సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది తెలుగు ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండే ప్రభాస్.. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే అది ప్రభాస్ ఫ్యాన్స్ కి అన్ని పండుగలు కలిసి ఒకేసారి వచ్చినట్లుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఎవరికీ తెలియని ఓ ప్రశ్న అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: