ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేవలం ఒక్క కర్నూలు జిల్లా లోనే రెండు వందల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ లేఖలో... ప్రజలను కాపాడడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కర్నూలు జిల్లాలో విపరీతంగా వ్యాప్తి చెందడానికి జగన్ సర్కార్ ఏ మాత్రం కారణం కాదని, ప్రభుత్వంపై నిందలు వేయటం మా పార్టీ ఉద్దేశం కాదని తప్పులు అస్సలు అన్వేషించబోమని ఆయన అన్నారు. కానీ ప్రజల ఆరోగ్యమే జనసేన పార్టీ యొక్క ఆకాంక్ష అని ఆయన అన్నారు.

 

ఈ క్షణం వరకు 203 మంది కరోనా వైరస్ బారిన పడగా... వారిలో ఐదుగురు చనిపోగా... నలుగురు కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు కోలుకున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఒకే ఒక జిల్లాలో నమోదు కావడం బాధాకరం అని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు  జిల్లాకు  ప్రత్యేక బృందాల్ని పంపాలని, ప్రత్యేక వ్యూహంతో వ్యాధి ఉదృతికి అడ్డుకట్టవేసి, ప్రజలలో కొండంత మనోధైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. వ్యాధిని అరికట్టే క్రమంలో ఇప్పటివరకు జరిగిన పొరపాటులను మళ్ళీ రిపీట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తగిన చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు కూడా మేల్కొకుండా కరోనా వ్యాధి నివారణ కోసం కఠినమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేజారి పోతుందని జనసేన అధినేత ఆందోళన వ్యక్తం చేశారు.


కర్నూలు జిల్లాలోని జనసేన స్థానిక నాయకులతో పాటు బీజేపీ నాయకుడు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా వ్యాధి తీవ్రతను నిర్మూలించేందుకు తమ వంతు చర్యలను చేపడుతున్నారని, వారు తీసుకుంటున్న చర్యలను లేఖ రూపంలో తనకు తెలియజేస్తారని అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రతి ఒక్కరిలో రెక్కేత్తుతున్న ఆందోళనలను పోగొట్టి వారిలో మనో ధైర్యాన్ని నింపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: