ప‌వ‌ర్‌స్టార్ అన‌గానే అంద‌రికి గుర్తువ‌చ్చేది టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గుర్తు వ‌స్తాడు. మ‌రి కోలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ అంటే విజయ్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ కోలీవుడ్ ఎంట్రీ గురించి కొన్ని నెల‌లుగా క‌థ‌నాలు వేడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తండ్రీ-త‌న‌యులిద్ద‌రు కోలీవుడ్ ని ఏలే ప్లాన్ లో భాగంగా విజయ్ త‌నయుడిని రంగంలోకి దించుతున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఇందులో భాగంగా సంజ‌య్ ని కెన‌డాకు ఫిల్మ్ మేకింగ్ కోర్సుకు సంబంధించిన శిక్ష‌ణ కు పంపించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా ఆ ట్రెయినింగ్ కూడా పూర్త‌యిందిట‌. దీంతో విజ‌య్ మంచి స్ర్కిప్ట్ కోసం ఎదురుచూస్తోన్న స‌మ‌యంలో విజ‌య్ సేతుప‌తి రూపంలో అదిరిపోయే టాలీవుడ్ స్క్రిప్ట్ అత‌ని ముందుకెళ్లిందిట‌.

 

ఆ స్క్రిప్ట్ ఉప్పెన అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌థ‌ను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ సిద్దం చేయ‌గా, అత‌ని శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే ఓ జాల‌రి కుటుంబానికి చెందిన స్టోరీగా ఇప్ప‌టికే లీక్ అయింది. అయితే ఇందులో విల‌న్ పాత్ర పోషిస్తోన్న విజ‌య్ సేతుప‌తి ఓసారి విజ‌య్ న‌టిస్తోన్న మాస్ట‌ర్ షూటింగ్ సెట్స్ కు వెళ్లిన‌ప్పుడు విజ‌య్ కు ఈ క‌థ వినిపించాడుట‌.

 

స్టోరీ చాలా బాగుంద‌ని త‌మిళ నేటివిటీకి త‌గ్గ‌ట్టు రీమేక్ చేయ‌డానికి స్కోప్ ఎక్కువ‌గా ఉంద‌ని సేతుప‌తితో అన్నాడుట‌. కోలీవుడ్ ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని క‌మ‌ర్శియ‌ల్ అంశాలు స్క్రిప్ట్ లో ఉన్నాయ‌ని అన్నాడుట‌. సంజ‌య్ కి డెబ్యూ గా ఇదే స‌రైనస్క్రిప్ట్ అని భావిస్తున్నాడుట‌. దీంతో ఈ వార్త‌కు ఎక్కువ‌గా ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. దీన్ని బ‌ట్టి ఈ ప్ర‌చారం ఉప్పెన‌కు కావాల్సినంత బ‌జ్ ని తీసుకొస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్ శ్రోత‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: