బావ బామ్మర్దులు అయిన అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలసి ఒక్క సినిమాలో కూడా నటించడం లేదని చెప్పుకోవచ్చు. ఎవడు చిత్రంలో నటించారు కానీ ఆ సినిమాలో ఒక పార్టు లో అల్లు అర్జున్ కనిపిస్తే మరో పార్టు లో రామ్ చరణ్ కనిపిస్తాడు కానీ ఇద్దరు కలిసి వెండి తెరని ని షేర్ చేసుకో లేదు అని చెప్పవచ్చు. 1980 జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా... అతని అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు.


ఈ సినిమాలో వీరిద్దరి మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తప్పకుండా వచ్చే ఉంటుంది. ఈ అద్భుతమైన చిత్రంలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో అల్లు అర్జున్ నటించినట్లయితే సినిమా ఇంకా సూపర్ గా ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.


గతం గతః అంటారు కాబట్టి భవిష్యత్తులోనైనా స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్ తో కలిసి ఏదైనా ఒక మంచి ప్రయోగాత్మక సినిమాలో నటిస్తే కోట్ల మంది అభిమానులు సంతోషిస్తారు. ప్రస్తుతానికి రామ్ చరణ్ చారిత్రాత్మక సినిమా అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు రామ్ చరణ్ పుష్ప అనే సినిమాలో నటిస్తోంది.


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు ఇప్పట్లో థియేటర్లలో రిలీజ్ కావాలని అర్థమవుతుంది. కరోనా దెబ్బకిి దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా మొదటిసారిగా ఇంటికే పరిమితమై ఇంట్లో పనులు చేస్తూ సమయాన్ని గడుపుతున్నాడు. అల్లు అర్జున్ తన బామ్మ తో సమయాన్ని గడుపుతుండగా... రామ్ చరణ్ తన ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: