బాబాయి అబ్బాయి లైన నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఆడియో ఫంక్షన్స్ లలో కనిపిస్తేనే నందమూరి అభిమానులంతా తెగ సంతోషపడుతుంటారు. రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావాలని లక్షల మంది కోరుకున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఒకవేళ భవిష్యత్తు లో తారక్, బాలయ్య కలిసి వెండితెరపై కనిపిస్తే ఇక నందమూరి అభిమానులకు దీపావళి పండుగే అని చెప్పవచ్చు.


బాబాయి అబ్బాయి అనే పాత్రలలో తారక్, బాలయ్య ఓ సినిమాలో నటించినా... అది ఖచ్చితంగా హిట్ అయ్యెతీరుతుంది. దాంట్లో అనుమాన పడాల్సిన అవసరమే ఉండదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏదైనా డీసెంట్ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కుతే చాలా బాగుంటుంది. బాలయ్య బాబు ఆదేశిస్తే తారక్ పనులు చేయడం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పొలిటిషన్ పాత్రలో బాలయ్య నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సోషల్ డ్రామా అని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ లు కూడా తీసుకోబడ్డారు కానీ వారి పేర్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.


ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. కొమరం భీం పాత్రలో నటిస్తున్న తారక్ కు ఆర్ఆర్ఆర్ చిత్రం తన కెరీర్ లోనే ఓ గొప్ప సినిమాగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాలైనా స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ తెరకెక్కించాడు. చారిత్రాత్మక ఊహాత్మక డ్రామా అయిన ఆర్ఆర్ఆర్ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ కొరకై కోట్ల మంది అభిమానులు వేచి చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: