టాలీవుడ్ చుల్ బులి సమంత అక్కినేని తొలిసారిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఆ ప్రేమకథా చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్నిఅందుకోవడంతో పాటు తొలి సినిమాతోనే సమంత కు విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన సమంత, వాటిలో చాలావరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయాలతో ముందుకు దూసుకెళ్లారు. ఇక ఇటీవల మూడేళ్ళ క్రితం నాగచైతన్యను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న సమంత, ప్రస్తుతం ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. 

IHG

తెలుగు తో పాటు అటు తమిళ్ లో కూడా పలువురు హీరోల సరసన నటించి మంచి విజయాలు అందుకున్నారు సమంత.ఇకపోతే మరొక మూడు రోజుల్లో ఆమె తన 32వ జన్మదినాన్నిజరుపుకోనున్నారు. కాగా నేడు సాయంత్రం 5 గంటలకు ఆమె పుట్టినరోజు స్పషల్ సిడిపి ని మరొక అగ్ర హీరోయిన్ తమన్నా భాటియా తన చేతులమీదుగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఆమె పుట్టిన రోజుని  సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ట్రెండ్స్ గా ముందుకు నడిపించేందుకు ఆమె ఫ్యాన్స్ రెడీ అయ్యారు కూడా. 

IHG

తమ అభిమాన హీరోయిన్ ఓవైపు జన్మదినాన్ని జరుపుకోవడంతో పాటు ఆమె సినిమా ఇండస్ట్రీ కి విచ్చేసి 10 ఏళ్ళు గడుస్తుండడం తో అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పదేళ్ల సినిమా కెరీర్ లో తన అద్భుతమైన నటనా కౌశలంతో మొత్తంగా 30 కి పైగా అవార్డులు గెలుచుకున్న సమంత, ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. మరోవైపు తాను స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న సమంత, ఈ పుట్టినరోజుని లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకోనున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: