ఈ మధ్య కాలంలో మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా కొత్తదనం కోరుకునే ప్రయత్నం చేస్తున్నారు. విలక్షణ అనేది సినిమాలో ఉండాలి అనేది వాళ్ళ ఆశగా ఉంది. చిన్న హీరో సినిమా అయినా పెద్ద హీరో సినిమా అయినా సరే ఇప్పుడు ఎక్కువగా సినిమాలో కోణాలు కాస్త భిన్నంగా ఉండాలి అనేది అభిమానుల ఆశ. మన తెలుగు సినిమాల్లో హీరోకి ఇమేజ్ ఎక్కువ కాబట్టి హీరోలు ఎక్కువగా అలాంటి సినిమాలను చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు కొందరి కాంబినేషన్ లో అభిమానులు సినిమాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. 

 

అది ఏంటీ అంటే ప్రధానంగా చిరంజీవి ప్రభాస్ కలిసి నటించాలి అనేది చాలా మంది అభిమానుల కోరిక. ఆ సినిమాలో చిరంజీవి ప్రభాస్ కి విలన్ గా ఉండాలని చిరంజీవి మాఫియా డాన్ గా నటిస్తే బాగుంటుంది అదే దావూద్ ఇబ్రహీం రేంజ్ పాత్ర లో ఆయన చేస్తే ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు తక్కువే అయినా మంచి కథ ఉంటే మాత్రం వీళ్ళు ఇద్దరు సినిమా చెయ్యాలి అనేది చాలా మంది కోరిక. మరి ఇది ఎంత వరకు ముందుకు అడుగు పడుతుందా అనేది చూడాలి. మన తెలుగులో దర్శకులకు ప్రతిభ ఉన్నా సరే... 

 

పరిమితులతో ఆ ప్రతిభను కాస్త కప్పి ఉంచుతారు. అందుకే ఇలాంటి కథలు అంత త్వరగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేయరు. టాలీవుడ్ లో అభిమానులు కాస్త భిన్నమైన సినిమాలను కోరుకుంటున్నా మన వాళ్ళు మాత్రం అలాంటివి చేయడానికి భయపడే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూడాలి అంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ఇద్దరూ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: