టాలీవుడ్ లో త్రివిక్రమ్ సినిమా అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. హీరోకి ఏ విధంగా ఫాలోయింగ్ ఉంటుందో అదే స్థాయిలో ఆయనకు కూడా ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా హీరోల నోటి నుంచి ఆయన మాట్లాడించే మాటల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకమైన ఫాన్ బేస్ ఉన్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన సినిమా వస్తే చాలు కొందఱు పనులు మానుకుని సినిమా కోసం వెళ్తూ ఉంటారు. అగ్ర దర్శకులకు కూడా లేని క్రేజ్ తక్కువ కాలంలో ఆయనకు వచ్చింది అనేది అర్ధమవుతుంది. దర్శకుడు అనే వాడు ఇలాగే ఉండాలి అన్నట్టు ఆయనలో ఉండే కొన్ని కోణాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

 

చిన్న హీరో ఆయన తో సినిమా చేసినా సరే అది మంచి హిట్ అవుతుంది అనే భావన ఉంటుంది. దానికి కారణం త్రివిక్రమ్ కి ఉన్న ఇమేజ్ అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర దర్శకులు ఎవరూ కూడా ఇంత తక్కువ కాలంలో ఇన్ని మంచి సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఆయన సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ భయపడుతున్నాడు కంగారు పడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని కథ విషయంలోనే ఆయన భయపడుతున్నారు అనే వార్తలు వచ్చాయి. 

 

కథలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పారు ఆ తర్వాత త్రివిక్రమ్ ని కలిసిన నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా కొన్ని మార్పులు చెప్పారు. వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఆయనకు ఇంకా స్పష్టంగా అర్ధం కాలేదు అనేది టాలీవుడ్ జనాల మాట. ప్రస్తుతం తెలుగులో బాగా డిమాండ్ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్. అలాంటి దర్శకుడు ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడో టాలీవుడ్ జనాలకు కూడా అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: