ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో దేశంలోని అనేక రాష్ట్రాలు ఎలా కట్టడి చేయాలో ప్రభుత్వాలు ఆందోళనకు గురి అవుతున్నాయి. దీనినుంచి తప్పించుకొనడం ఉన్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమే. అలా చేస్తే కరోనా బారినపడకుండా ఉండొచ్చని ప్రభుత్వాలు గొంతెత్తి చెబుతున్న కాని ప్రజలు మాత్రం యధేచ్ఛగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే దీని మీద అనేక మంది ప్రభుత్వ అధికారులు సెలబ్రిటీలు మొదలగు వారు అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం వారి మార్గాన్ని మార్చుకోవడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే...


తాజాగా ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు ఈ వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. అందులో నేను చాలా మనోవేదనకు గురవుతున్నారు దయచేసి ప్రభుత్వం చెప్పే మాటలు అర్థం చేసుకోండి అలాగే వారు ఉత్తర్వుల మేరకు అందరూ కొద్దిరోజులు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి, ఇంక దీనితో వైద్య ప్రపంచం ఆవేదనకు గురవుతుంది. వైద్యులు, నర్సులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ దీనికి సహకరించాలని అంటూ కన్నీళ్లు పెడుతూ ఒక వీడియోని సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందేశం పంపిన వీడియో చాలా వైరల్ గా మారి మనసుకు హత్తుకునేలా చేసింది.


అయితే తాజాగా వడివేలు దీనికి స్పందించిన తీరును గుర్తించి నా డైలాగుల్లో ఒకటైన " ఇంత కొత్త తాండి నీయుమ్ వరకూడధు నానుమ్ వర మాటెన్ " అని చెబుతూ దయచేసి తమ ఇళ్లలో, వీధిలోనుంచి బయటకు రావొద్దు అంటూ తెలిపాడు. అలాగే తమ పిల్లలకి మంచి ఏదో, చెడు ఏదో, శుభ్రంగా ఎలా ఉండాలో అలాగే కొన్ని మంచి ఆరోగ్య సూత్రాల్ని, పిల్లల్ని చదివించడయ్యా అని తెలిపి లాక్ డౌన్ లో ఎలా ఉండాలో వడివేలు అందరికీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: