మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి శిఖరంగా ఉన్నారు. ఆయనది నాలుగు దశాబ్దాల అనుభవం. 151 సినిమాలు చేసి నటనలో పండిపోయిన చిరంజీవి ఇపుడు టాలీవుడ్ లో  అందరికీ స్పూర్తిగా ఉన్నారు. ఆయన కుటుంబమే ఒక పరిశ్రమగా రూపు దిద్దుకుంది. చిరంజీవిలో ఇప్పటికీ సినిమా వ్యామోహం పోలేదు, ఇంకా తాను నటనను చూపించాలనుకుంటున్నారు. తనలోని ప్రతిభను ఇంకా తవ్వి తీస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి కుటుంబం అందమైన కుటుంబం. ముగ్గురు పిల్లలకూ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కుమార్తెలు పిల్లలతో తాత హోదాను చిరంజీవికి ఏనాడో ఇచ్చేశారు. అయితే కొడుకు రాం చరణ్ మాత్రం ఆ ముచ్చట తీర్చడంలేదుట. ఈ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవి తన భావాలను పంచుకుంటూనే తన వ్యక్తిగత విషయాలని కూడా షేర్ చేసుకున్నారు.

 

చిరు అసలైన వారసుడు ఎపుడు వస్తున్నాడు అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ కొడుకు రాం చరణ్ మీద ఫిర్యాదు లాంటిదే చేశారనుకోవాలి.తనకూ మనవడిని ఎత్తుకోవాలని కోరిక ఉందని చెప్పుకున్న చిరంజీవి అయితే ఆ విషయంలో రాం చరణ్, ఉపాసన ప్లానింగులేమిటోనని అనేశాడు. తన సతీమణి సురేఖ ఆ విషయం వారిని ఎపుడూ అడుగుతుందని, అయినా కొంతవరకే తాము చెప్పగలమని అన్నారు.

 

మొత్తానికి చిరంజీవి వారసుడిగా రాం చరణ్ వెండి తెర మీద రాణిస్తున్నాడు. తండ్రికి తగిన కుమారుడిగా కూడా పేరు నిలబెడుతున్నాడు. ఇన్ని ఆనందాలు ఇస్తున్న చెర్రీ మెగాస్టార్ కి తాత హోదా మాత్రం ఇవ్వడంలేదు. అదే చిరంజీవి ఫిర్యాదులా ఉంది. అందుకే తాను కూడా అసలైన వారసుడి కోసం అందరిలా ఎదురుచూస్తున్నానని చిరంజీవి చెప్పుకుంటున్నారు. 

 

మొత్తానికి చెర్రీ మీద చిరు ఇలా షాకింగ్ కామెంట్స్ చేశారనుకోవాలి. మరి మెగాస్టార్ భావాలను తెలుసుకుని తొందరలో ఆయనకు తాత హోదాను రాం చరణ్ ఇస్తాడనుకొవాలి. అది మెగా ఫ్యాన్స్ కి కూడా ఆనందమే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: