మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తారక్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో అతనికి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అందరు అగ్ర దర్శకులు అతని తో సినిమా చేయడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత౦ మన తెలుగు హీరోలకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. ఇప్పుడు తారక్ కోసం కన్నడ హీరో ఒకరు ప్రయత్నం చేస్తున్నారట. 

 

ఆయన ఎవరో కాదు శివ రాజ్ కుమార్ అని సమాచారం. మన తెలుగులో పెద్దగా కన్నడ సినిమాలు ఆడే అవకాశం ఉండదు చాలా మంది అంతగా ఆ సినిమాలు ఎక్కే అవకాశం కూడా ఉండదు. అయినా సరే మన తెలుగులో సినిమాలను విడుదల చెయ్యాలని కేజిఎఫ్ తర్వాత ఎంతో ఆశగా అక్కడి హీరోలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగు హీరోలు ఎక్కువగా మార్కెట్ మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి వారి తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా తెలుగులో చేస్తే బాగుంటుంది అని చూస్తున్నారట. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నారట. 

 

ప్రశాంత్ నీల్ కి మన తెలుగులో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఎన్టీఆర్ కూడా ముందు నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు కూడా. మరి తారక్ సినిమా చేస్తాడా లేదా అనేది కూడా చూడాలి. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులకు కూడా ఒకరకమైన ఆసక్తి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: