మన తెలుగు సినిమా ఎదురు చూసే సినిమా ఏదైనా ఉందీ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమానే, మన తెలుగులో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నా సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. దర్శక నిర్మాతలు మాత్రం ముందుకి రావడం లేదు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంటుంది. 

 

ఎప్పుడో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లో వీరి కాంబినేషన్ ని ప్రేక్షకులు చూడాల్సి ఉంది కాని పవన్ ప్లేస్ లో శ్రీకాంత్ నటించడం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా కోసం మన తెలుగు ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తున్నారు. అయినా సరే సినిమా చేయడానికి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. చిరంజీవికి పరిమితంగా అభిమానులు ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాను నందమూరి అభిమానులు కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా వస్తే మంచి హిట్ అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం కూడా. 

 

,మరి ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకుని వెళ్తారా అనేది చూడాలి. తెలుగులో అగ్ర దర్శకులు కూడా ఈ కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాలని చూస్తున్నా నిర్మాతలు కూడా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. అసలు ఈ సినిమా వస్తుందా లేదా అనేది స్పష్టత లేకపోయినా సినిమా రావాలి అని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిసి నటించే అవకాశం ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. అగ్ర హీరోల సినిమాల కోసం ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో మన కు తెలిసిందే. మరి వస్తుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: