టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు అన్నీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే సినిమా మాత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. కొన్ని కారణాలతో సినిమాను దర్శకుడు రాజమౌళి వాయిదా వేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆసక్తి రోజు రోజు కి పెరుగుతుంది గాని తగ్గే అవకాశం ఎక్కడా కూడా కనపడటం లేదు. మన తెలుగు ప్రేక్షకులకు ఏదైనా చిన్న వార్త వస్తే చాలు అది ఒక పండగ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాలో ఏ వార్త బయటకు వచ్చినా సరే ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న కచ్చితంగా విడుదల చేస్తారని అంటున్నారు. మరి వస్తుందా లేదా అనేది పక్కన పెడ్తే ఇప్పుడు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఆసక్తి ఉంది. ఆ పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద అభిమానులకు ఒక ఆలోచన ఉంది, అరి జక్కన్న ఆ ఆలోచనలకు దగ్గరగా వెళ్తారా లేక తారక్ ని మరో కోణం లో చూపిస్తారా అనేది అర్ధం కావడం లేదు. తారక్ ఈ సినిమాలో రామ్ చరణ్ కి ఫ్రెండ్ గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమా స్నేహం ఆధారంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

 

తారక్ ఈ సినిమాలో నటించే పాత్ర కోసం అటు బాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమాలో తారక్ దొంగ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. దొంగ అంటే అతను చంపే విధంగా కాదు. అగ్ర వర్ణాల దగ్గర దోచుకుని లేని వాళ్లకు పెట్టే విధంగా ఉంటుంది అని అంటున్నారు. లేని వాళ్ళ కోసం పోరాటం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: