కరోనా వల్ల లాక్ డౌన్ కొసాగుతుండడంతో అందరితో పాటు సినీ సెలెబ్రెటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే బి ద రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ తో సోషల్ మీడియా లో కొంత మంది సెలబ్రెటీలు హడివిడి చేస్తుండగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాత్రం కొత్త లుక్ లోకి మారాడు. ఇస్మార్ట్ శంకర్ ఆతరువాత రెడ్ లో గడ్డం తో మాస్ లుక్ లో కనిపించిన రామ్ తాజాగా క్లీన్ షేవ్ తో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. ఆ పిక్ ను రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 
 
 
ఇదిలావుంటే ఈపాటికే విడుదలకావాల్సిన రెడ్ కరోనా వల్ల  వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. దాంతో జూలై లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి  సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా ఓటిటి లో రెడ్ విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు సినిమాను మాత్రం థియేటర్లలోనే విడుదలచేయాలని చూస్తున్నారు.
 
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ సరసన మాళవిక శర్మ, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రామ్ బాబాయ్ స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: