హీరోగానే కాకుండా.. విలన్ గా కూడా మెప్పిస్తున్న నటుడు విజయ్ సేతుపతి. అందుకే తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు. బన్నీ, సుకుమార్ మూవీ పుష్పలో ముందుగా విజయ్ సేతుపతినే ఎంచుకున్నాడు. అయితే ఈ అరవ హీరో రెమ్యునరేషన్ పెంచేసి కొన్ని కండీషన్స్ పెట్టడంతో.. వేరొకరిని చూసుకుంది చిత్రయూనిట్. 

 

తమిళంలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తూ.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీ కూడా విజయ్ సేతుపతి యాక్టింగ్ కోరుకుంటోంది. తమిళంలో మంచి క్రేజ్ ఉండటంతో.. ముఖ్యంగా పాన్ ఇండియాగా తెరకెక్కే తెలుగు సినిమాలో విజయ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సైరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. 

 

సైరా తర్వాత విజయ్ ఉప్పెన సినిమా చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెనలో విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. రజినీకాంత్ పేటలో విలన్ గా కనిపించిన విజయ్ మరోసారి ఉప్పెనలో ప్రతినాయకుడిగా మారాడు. సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ 5కోట్లు తీసుకున్నాడని.. పుష్పలో విలన్ రోల్ కోసం.. పారితోషికం డబుల్ చేసి 10కోట్లు డిమాండ్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. 

 

పుష్పలో విలన్ గా విజయ్ సేతుపతి బదులు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ తమిళంలో వరుస సినిమాలతో బిజీ కారణంగా.. డేట్స్ ఎడ్జెస్ట్ కాక పుష్ప నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఉప్పెన కోసం తీసుకున్న దానికి డబుల్ రెమ్యునరేషన్ 10కోట్లు అడుగడం.. తమిళంలో విడుదల చేయొద్దని కండీషన్ పెట్టాడట. విలన్ రోల్ కోసమే తమిళంలో రిలీజ్ చేయొద్దన్నాడనుకుంటే.. ఆల్ రెడీ విలన్గా నటించాడు. ఇది కారణం కాకపోవచ్చు. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న పుష్పను తమిళంలో రిలీజ్ చేయకపోవడం జరుగదు. బాలీవుడ్ లో సునీల్ శెట్టి కంటే.. తమిళంలో విజయ్ సేతుపతికి ఎక్కువ క్రేజ్ ఉంది. విజయ్ నటిస్తే.. పుష్ప తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్ గా రిలీజ్ అయ్యేది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: