టీవీ షోలు న‌డిపిస్తూ ఉన్న యాంకర్ల పేర్లు చెప్పండి అంటే ముంద‌ర గుర్తుకువ‌చ్చేది ఒకే ఒక్క‌పేరు ఆ పేరు ఎవ‌రిదో కాదు. అందానికి అందం చ‌లాకీత‌నం తాను డ్యాన్స్ వేసిందంటే చాలు చూడ‌డానికిఎంతో ఇంపుగా ఉంటుంది ఆమె ఉద‌య్‌భాను. అంద‌రిలో క‌లిసిపోయి ఒక ఫ్రెండ్లీ నేచ‌ర్ ఈమె స్వ‌భావం. ఇంపైన మాట‌తీరుతో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడున్న యాంక‌ర్ల‌తో పోల్చుకుంటే ఒడ్డుపొడుగు అన్నీ స‌మ‌పాళ్ళ‌లో ఉన్న యాంక‌ర్ ఉద‌య్‌భాను అంటే  అంద‌రికీ ఇష్ట‌మే. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గానే మొట్ట‌మొద‌టిసారి కెమెరా ముందుకు వ‌చ్చింది. ఈటీవీలో వ‌చ్చే హృద‌యాంజ‌లి అనే షో ద్వారా ఈమె ప‌రిచ‌య‌మైంది. ఆమెకు అప్ప‌టికి యాంక‌ర్ అనే ప‌దానికి అర్ధం తెలియ‌క‌పోయినా గ‌ల‌గ‌లా మాట్లాడుతూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. తండ్రి డాక్ట‌ర్‌. త‌ల్లి ఆయుర్వేద వైధ్యురాలు.

 

ఒక త‌మ్ముడు కూడా ఉన్నాడు అత‌ను ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌. ఆమె తండ్రి ఒక క‌వి కూడా ఆయ‌న క‌లం పేరు ఉద‌య‌భాను. ఆ ప్రేమ‌తోనే కూతురు పేరు ఆయ‌న ఉద‌య్‌భాను అని పెట్టుకున్నారు. త‌న‌కు నాలుగేళ్ళు ఉండ‌గానే ఆయ‌న చనిపోవ‌డం జ‌రిగింది. తాను చిన్నగా ఉన్న‌ప్పుడే ఆమె త‌ల్లి ఒక ముస్లిం వ్య‌క్తిని వివాహ‌మాడింది. అయితే అత‌డికి ఏడుగురు సంతానం. అయితే ఉద‌య్‌భానుకి ప‌దిహేనో ఏట ఒక ముస్లింతో వివాహం జ‌రిగింది అయితే అది ఇష్టం లేక అత‌నితో స‌రిగా ఉండ‌లేదు. ఇక విడాకుల అనంత‌రం త‌ల్లికి ఇష్టం లేకుండా విజ‌య్‌కుమార్ అనే అత‌న్ని వివాహం చేసుకుంది. ఇక తండ్రి చ‌నిపోయాక ఆమె త‌ల్లి వేరే వివాహం చేసుకున్నాక ఉద‌య్‌భానుకి స‌రైన ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఆమె జీవితంలో చాలా ఇబ్బందులు ప‌డింది. 

 

అయిన‌ప్ప‌టికీ త‌న కెరియ‌ర్‌ని మాత్రం ఎక్క‌డా ఆప‌కుండా ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఉద‌య్‌భాను ఎన్నో టెలివిజ‌న్ కార్య‌క్ర‌మాల‌ను ర‌క్తిక‌ట్టించింది. ఈ క్ర‌మంలోనే హృద‌యాంజ‌లి అనే కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్ళింది. త‌న మొద‌టి ప్రోగ్రామ్‌తోనే తాను స‌క్సెస్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: