టాలీవుడ్ లో కొన్ని బంధాల గురించి మీడియా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా యాంకర్ల జీవితంలో జరిగే సంఘటనలు వారి జీవితంలో ఉండే కొందరు వ్యక్తుల గురించి పదే పదే కథనాలు రాస్తూ ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఘటనల గురించి ఉన్నవి లేని ప్రచారంలోకి బాగానే వస్తు ఉన్నాయి. యాంకర్లు ఎం చేసినా సరే మీడియా లో ఎక్కువగా హైలెట్ అవుతూ రావడం గమనార్హం. సుమా ఝాన్సి, ఇలా కొందరి గురించి వార్తలు ఎక్కువగా వస్తు ఉంటాయి. 

 

ఝాన్సి జీవితం గురించి చాలా కథనాలే మీడియాలో వచ్చాయి. ఆమెకు ఉత్తేజ్ కి మధ్య ఉన్న బంధం గురించి మీడియా ఎక్కువగా కథనాలు రాసింది. అసలు వాళ్ళు అంత సన్నిహితంగా ఉండటానికి కారణం ఎమై ఉంటుంది అనేది మీడియాకు కూడా స్పష్టత లేదు. ఇద్దరు కూడా ఎక్కడ చూసినా అత్యంత సన్నిహితంగా కనపడుతూ ఉంటారు. అసలు వీరు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటీ అనేది చూస్తే ఝాన్సి జీవితంలో కష్టాలు పడుతున్న సమయంలో ఉత్తేజ్ ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలిచాడు అని చెప్తారు. 

 

ఆయన ప్రోత్సాహం తో ఆమె జీవితంలో కీలక అడుగులు వేసిందని వ్యక్తిగత జీవితంలో ఆమె ఎన్నో ఇబ్బందుల నుంచి బయటకు వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది స్పష్టత లేకపోయినా ఆమెకు అవకాశాలు లేని సమయంలో అతనే ఎక్కువగా తనకు ఉన్న పరిచయాలతో ఆఫర్లు ఇప్పించాడని ఆర్ధిక కష్టా ల నుంచి ఆమె అక్కడి నుంచే బయటపడింది అని చెప్తారు. అదే విధంగా కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యల గురించి కూడా అతనితో ఆమె ఎక్కువగా చర్చించడం ఆ తర్వాత వాటి పరిష్కారానికి అతను కృషి చేయడం జరిగాయని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: