టాలీవుడ్ లో అగ్ర యాంకర్ సుమా. ఏ బుల్లి తెర షో అయినా సరే సుమా ఉంటేనే బాగుంటుంది అనే స్థాయిలో ఆమె ఆకట్టుకుంది అనేది వాస్తవం. షో ఎలా ఉన్నా సరే సుమా ఉంటే చాలు కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన చాలా మంది నిర్మాతల్లో ఉంటుంది. అందుకే ఆమె కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వాటి కోసం కూడా ఎక్కువగా ఆమె ఆశ పడుతుంది అని అంటారు. టాలీవుడ్ లో ఆమెకు పాపులారిటి ఎక్కువగా ఉందని దీనితో ఆమె అవకాశాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంది అంటారు. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె టాప్ యాంకర్ గా ఉన్నా సరే కొందరు యాంకర్లు తనకు ఎక్కడ పోటీ వస్తారో అనే భయం ఆమెలో ఎక్కువగా ఉందని అంటారు. అందుకే కొందరు ఆమెకు పోటీ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది అని టాలీవుడ్ జనం అంటారు ఏ బుల్లి తెర షో అయినా సరే తానే ఉండాలి అనే భావన ఆమెలో ఎక్కువగా ఉంటుంది అనేది టాలీవుడ్ జనాల మాట. ఇందులో భాగంగానే ఆమె ఎక్కువగా యాంకర్ అనసూయను ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని అంటారు. ఆమె ఎన్ని విధాలుగా అవకాశాల కోసం పెద్ద షోస్ కి ప్రయత్నాలు చేసినా సరే ఈమె నుంచి ఇబ్బందులు ఉంటాయని అంటారు. 

 

ఆమెకు పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పరిచయాలతో ఆమె కాస్త ఎక్కువగా అవకాశాలను దక్కించుకుంటుంది. అనసూయ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు నిర్మాతలకు అవకాశం ఇవ్వాలని ఉన్నా సరే సుమా కారణంగా ఇవ్వలేని పరిస్థితిలో వారు ఉన్నారని టాలీవుడ్ టాక్. మరి ఎంత వరకు నిజమో గాని ఒక ప్రముఖ ఛానల్ కూడా సుమా కు భయపడిన సందర్భం ఉందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: