టాలీవుడ్ లో టాప్ యాంకర్ అవుతుంది అనుకున్న వారిలో మంజూష కూడా ఒకరు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి చెల్లిగా మంచి పాత్ర చేసింది. ఆ తర్వాత ఆ సినిమాలో ఆమె నటన కూడా చాలా మంది ప్రేక్షకులకు బాగా బాగా నచ్చింది అని టాక్ కూడా వచ్చింది. ఆమెకు వరుస ఆఫర్లు ఇవ్వాలని చాలా మంది టాలీవుడ్ పెద్దలను కూడా కోరారు. ఆ తర్వాత ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. ఆమెకు రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ కూడా వచ్చింది. ఆమె మాత్రం యాంకరింగ్ మీద ఉన్న ఇష్టం తో ఆఫర్లను పక్కన పెట్టింది. 

 

పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే వదులుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆమె ఆ కోవలోకే వెళ్తుంది. అవకాశం వచ్చినా సరే ఆమె రెండు చేతులతో వదులుకుంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చినా సరే తనకు వద్దు అనుకుంది. ఆమె టాప్ హీరోయిన్ కాకపోయినా సరే చిన్న హీరోల పక్కన నటిస్తుంది అనుకునే స్థాయిలో అయితే ఆమెకు ఉంది. అయినా సరే ఆమె కెరీర్ ని అనవసరంగా నాశనం చేసుకుంది. ఆ తప్పు గనుక ఆమె చేయకుండా ఉంటే ఆమెకు మంచి ఆఫర్లు వస్తూ ఉండేవి కూడా. 

 

పెద్ద హీరోల సినిమాలకు ఆమె మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే అసలు ఇప్పుడు ఇంకా కెరీర్ బాగుండేది అని అంటారు. యాంకర్ గా ఆమె కనపడే షోస్ తక్కువ. ఆమె యాంకర్ గా కంటే సోషల్ మీడియాలో నే ఎక్కువగా బిజీ గా ఉంటుంది అంటారు టాలీవుడ్ జనం. ప్రస్తుత౦ ఆమె రెండు మూడు షోస్ చేయడం తో పాటుగా కొన్ని సినిమాలకు ప్రమోషన్ చేస్తూ వస్తుంది. మరి ఆఫర్లు వస్తాయో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: