టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా ఉన్న వారిలో సుమా ఝాన్సి ఒకరు. ఝాన్సి సుమా రేంజ్ లో కాకపోయినా సరే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కెరీర్ లో ఆమె యాంకర్ గా ఉన్న సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులతో ఆఫర్లు వెనక్కు వెళ్ళాయి అని చెప్తారు. యాంకర్ గా ఆమెకు మంచి అవకాశాలు వచ్చినా సరే కాపాడుకోలేక పోయింది అంటారు జనం. దానికి స్పష్టమైన కారణం తెలియదు గాని ఆమెకు కాస్త దూకుడు ఎక్కువ అని అంటారు. పారితోషిక౦ విషయంలో ఆమె బాగా పెంచేసింది అనే వాళ్ళు ఉన్నారు. 

 

తనకు వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో ఆమె భారీగా పారితోషికం పెంచింది అని అందుకే ఆమెను పక్కన పెట్టారు కొందరు అని అంటారు. స్పష్టమైన కారణం ఏంటో పక్కన పెడితే ఆమెకు సుమాకు మధ్య ఉన్న విభేదాలే ఆమెను కెరీర్ లో వెనక్కు లాగాయనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమెకు ఉన్న పరిచయలతోనే ఆమె ఇబ్బందులు పడింది అని అంటారు. టాలీవుడ్ లో ఆమె కు సుమాకు అసలు పడేది కాదని అంటారు. ఒక ప్రముఖ ఛానల్ లో రెగ్యులర్ గా వచ్చే టీవీ షో లో ఆమెకు ఆఫర్ వచ్చింది. సుమాను పక్కన పెట్టి ఆమెకు ఆ ఆఫర్ ఇచ్చారు జనం. 

 

దీనితో సుమాకు అసలు ఆ పరిణామం ఏ మాత్రం కూడా నచ్చలేదు అని అంటారు. సుమా తనకు రావాల్సిన అవకాశాన్ని ఝాన్సి లాక్కుంది అనే కోపంలో ఉందని అంటారు. అందుకే ఆమెకు ఆఫర్లు వచ్చినా సరే సుమా రానీయలేదు అని అంటారు. పెద్ద పెద్ద షోస్ విషయంలో సుమానే ముందు ఆప్షన్ గా ఉంటుంది. ఆమె అందుబాటు లో లేకపోతేనే వేరే వాళ్ళను తీసుకుంటారు. వాటికి కూడా ఝాన్సి కి ఆఫర్లు రాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: