రాజమౌళి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తో తాను ఒక సినిమా చేయబోతున్నాను అంటూ స్వయంగా జక్కన్న చెప్పడంతో ఈ మూవీకి సంబంధించిన ఊహాగానాలు అనేకం వెంటనే మొదలైపోయాయి. ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ వారసుడుగా మహేష్ కొనసాగుతున్న పరిస్థితులలో అతడిని ని జేమ్స్ బాండ్ చూపెడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఒక స్పై మూవీగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది అంటూ ఇప్పటికే ఊహాగానాలు మొదలైపోయాయి. 

 

అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ ప్రకటన వినడానికి బాగున్నా ఆచరణలోకి రావడానికి చాల అడ్డంకులు ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన పరిస్థితులలో మహేష్ తో తీయబోయే సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయడమే కాకుండా కనీసం ఆ మూవీ బడ్జెట్ 250 కోట్ల స్థాయిలో ఉండి తీరాలి. 

 

అయితే మహేష్ ప్రస్తుత మార్కెట్ స్థాయికి అతడి పై 250 కోట్ల బడ్జెట్ పెట్టడం చాల రిస్క్ తో కూడుకున్న పని దీనికితోడు మహేష్ బాలీవుడ్ లో ఏమాత్రం క్రేజ్ లేకపోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ మార్కెట్ అంతా రాజమౌళి స్టామినా పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కరోనా సమస్యలు తరువాత తిరిగి ప్రారంభం అయ్యే సినిమాల నిర్మాణంలో భారీ బడ్జెట్ సినిమాలు ఇక ఉండకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్న విషయం తెలిసిందే. 

 

దీనికితోడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ జాతీయ స్థాయిలో ఏ మేరకు భారీ కలక్షన్స్ రాబడుతుంది అన్న విషయం పై కూడ మహేష్ రాజమౌళిల మూవీ బడ్జెట్ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా కనీసం రెండు సంవత్సరాలు జక్కన్నకు అంకితం అయిపోయి రాజమౌళి సూచనలకు అనుగుణంగా తమ రూపు రేఖలను బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవలసి వస్తుంది. అంతేకాదు హీరోలను విపరీతంగా రాజమౌళి కష్టపడతాడు. దీనితో చాల సుకుమారంగా ఉండే మహేష్ రాజమౌళి టార్చర్ కు తట్టుకోవడమే కాకుండా ఏకంగా అతడి సినిమా కోసం కనీసం రెండు సంవత్సరాల బంది ఖానాను ప్రస్తుత పరిస్థితులలో మహేష్ అంగీకరిస్తాడా భారీ బడ్జెట్ సినిమాలకు జాతీయ స్థాయిలో వందల కోట్లల్లో కలక్షన్స్ వచ్చే పరిస్థితి ఈ కరోనా తరువాత ఇండస్ట్రీకి ఉందా అన్న విషయాలు తేలిన తరువాత మాత్రమే మహేష్ రాజమౌళిల మూవీ ఉంటుందని అప్పటి వరకు ఈ మూవీ ప్రాజెక్ట్ పై ఇలాంటి శేష ప్రశ్నలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: