కరోనా మహమ్మారి కారణంగా ప్రజలందరూ ఇళ్లలో బంధీ అయిపోయారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ ని ఆశ్రయిస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కాష్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, సన్ నెక్స్ట్ లాంటి ఓటీటీ లన్ని నాన్ స్టాప్ స్ట్రీమ్ చేస్తుంటారు. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లన్నీ ప్రస్తుతం లాభాలను గడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కొత్త సినిమాలను ఓటీటీ లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి వచ్చింది. దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో 'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' కమలాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్ విడుదల చేశారు. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఫన్ అండ్ రొమాన్స్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు. మౌత్ టాక్ బావుండడంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.

 

సినిమా తెలుగు డబ్ వర్షన్ ని సుమారు 80 లక్షల కి అటూ ఇటూ గా అమ్మినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది. దాంతో 1 కోటి రేంజ్ టాక్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో 70 లక్షల షేర్ ని అందుకోగా లాంగ్ రన్ లో మరో 28 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది. దాంతో టోటల్ 98 లక్షల షేర్ ని వసూల్ చేసి ఓవరాల్ గా జస్ట్ లో మార్జిన్ మిస్ అయినా బిజినెస్ మీద 18 లక్షల ప్రాఫిట్ తో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే కచ్చితంగా సినిమా లాంగ్ రన్ లో 2 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని వసూళ్ళ ని తెలుగులో సొంతం చేసుకుని ఉండేది. ఈ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.

 

కాగా డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'ఆహా' ఈ చిత్ర డిజిటిల్ రైట్స్ దక్కించుకోగా త్వరలో ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ పీరియడ్ కావడంతో ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. వెండితెర మీద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ డబ్బింగ్ సినిమా.. డిజిటల్ ఫార్మాట్ లో కనులు కనులను దోచుకొని మంచి విజయం అందుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: