ఇండియాలో క్రికెట్ అనేది ఓ మతంగా కొనసాగుతోంది. ప్రపంచ క్రికెట్‌ కు ఇండియాను మించిన మార్కెట్ లేదు. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌ ను ఇండియన్‌ క్రికెట్ శాసిస్తోంది. అయితే ఇండియన్‌ క్రికెట్‌ లో ప్లేయర్స్‌ తో పాటు అదే స్థాయిలో పాపులర్‌ అయిన మరికొందరు కూడా ఉన్నారు. వాళ్లే యాంకర్స్‌. ఈ యాంకర్స్‌ క్రికెట్ ఫీల్డ్‌ కే గ్లామర్ తీసుకువస్తున్నారు. అలాంటి ఇండియన్‌ క్రికెట్‌ ను మరింత హాట్‌ గా మార్చేస్తున్న బ్యూటీ మయాతి లాంగర్‌.

 

స్టార్‌ నెట్‌వర్క్‌ లో జర్నలిస్ట్‌ గా జాయిన్‌ అయిన మయాతి తరువాత స్టార్స్‌ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ గా యాంకర్‌ గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ కేవలం క్రికెట్‌ మాత్రమే కాదు ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్స్‌ కు కూడా వ్యాఖ్యతగా వ్యవహరించింది. జీ స్పోర్ట్స్ నిర్వహించిన ఫుట్‌ బాల్‌ కేఫ్ అనే ప్రోగ్రామ్‌ ఈ భామకు ఎంతో పేరు తెచ్చింపెట్టింది.  ఆ తరువాత 2010 లో ఈ ఎస్‌ పీ ఎన్‌ లో ప్రసార్ అయిన ఫీఫా వరల్డ్ కప్, కామన్‌ వెల్త్‌ గేమ్స్‌, 2011 లోక్రికెట్ వరల్డ్ కప్‌, 2014 లో ఇండియన్ సూపర్‌ లీగ్, 2015 లో ఐ సీ సీ క్రికెట్ వరల్డ్ కప్‌, 2018 లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, 2019 లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్, 2019 లో క్రికెట్ వరల్డ్‌ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నిలకు ఈ భామ వ్యాఖ్యత గా వ్యహరించింది.

 

అమెరికా లో ఉన్న సమయంలో ఫుట్‌ బాల్ పట్ల ఆకర్షితురాలైన మయాతి, కాలేజ్‌ ఫుట్‌ బాల్ టీం లో మెంబర్‌ గా ఉండేది. తరువాత ఫీఫా బీచ్‌ ఫుట్‌ బాల్‌ కు గెస్ట్ యాంకర్‌ గా తన కెరీర్‌ ను ప్రారంభించింది. ఆ షో ఆమెకు మంచి పేరు తీసుకురావటంతో జీ సంస్థలో ఫుట్‌ బాల్ కెఫే కార్యక్రమానికి ఆఫర్ వచ్చింది. జీ సంస్థ తరుపున ఎంతో మంది టాప్ ఫుట్ బాల్‌ ప్లేయర్స్‌ ను ఇంటర్వ్యూ చేసింది ఈ భామ. ఆ తరువాత జీ సంస్థ లోనే క్రికెట్‌ వైపు మళ్లీ ఈ భామ తరువాత ఈ ఎస్‌ పీ ఎన్‌, స్టార్‌ స్పోర్ట్స్‌ లాంటి సంస్థలకు స్టార్ యాంకర్‌ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: