టెలివిజన్ రంగం ఊపందుకున్న తర్వాత ప్రైవేట్ ఛానెల్స్ బాగా పెరిగాయి. 25 ఏళ్ల క్రితం వరకూ ప్రజలకు టీవీ అంటే దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే. వారు చూపించేవే కార్యక్రమాలు.. వాళ్లు చెప్పేవే వార్తలు. చానెల్స్ ఒరవడి పెరిగాక వచ్చిన తొలి ప్రైవేట్ చానెల్స్ లో ఈటీవీ, జెమినీ టీవీ ప్రముఖమైనవి. ముఖ్యంగా జెమినీ టీవీ ఎంటర్ టైన్మెంట్ చానెల్ గా బాగా పాపులర్ అయింది. కేవలం సినిమా కాన్సెప్ట్స్ తోనే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. యువర్స్ లవింగ్లీ వంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించింది.

 

అయితే.. అప్పటివరకూ లేడీ యాంకర్లతోనే నడిపిన జెమినీ కొత్తగా ఆలోచించి మేల్ యాంకర్లను తీసుకొచ్చింది. ఇందుకు తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది. ఇద్దరు కుర్రాళ్లను ఈ షో ద్వారా పరిచయం చేసింది. జోగి నాయుడు, కృష్ణంరాజులను తీసుకుని ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. వీరికి ‘జోగి బ్రదర్స్’ అని పేరు పెట్టి ఓ సినిమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఆదివారం సినిమా వార్తల్ని ఉదయం 11గంటలకు తమ సెటైర్లు, కామెడీ టైమింగ్, గోదావరి-ఉత్తరాంధ్ర యాస, పూల చొక్కాల డ్రెస్సింగ్ తో వాళ్లు మాట్లాడే మాటలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆదివారం వస్తే 11గంటలకు టీవీలకు అతుక్కుపోవడమే. అతి తక్కువ కాలంలోనే వాళ్ల షో సూపర్ హిట్ అయిపోయి జనాల్లోకి వెళ్లిపోయింది.

IHG

 

జనాల నోళ్లలో జోగి బ్రదర్స్ పేర్లు మోగిపోయాయి. కొన్నేళ్ల పాటు ఆ షో జెమినీ టీవీలో కంటిన్యూ అయింది. వీళ్లకు దక్కిన పాపులారిటీతో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. మరెన్నో చానెల్స్ లో వీరిద్దరి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అయ్యాయి. మేల్ యాంకర్స్ గా తొలి అడుగు వేసి మరెంతో మంది రావడానికి ఇన్సిపిరేషన్ గా నిలిచారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: