కరోనా దెబ్బతో నిలిచిపోయిన సినిమా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఇండస్ట్రీ పెద్దలు కూడ చెప్పలేకపోతున్నారు. ఒకమీడియా సంస్థకు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిలిం ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. సినిమా షూటింగ్ లు ప్రారంభం కావడానికి మరో రెండు నెలలు పట్టినా ధియేటర్లు తెరుచుకోవడానికి కనీసం మరో నాలుగు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు అని చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలను కుదిపేస్తున్నాయి.


దీనితో ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న అత్యంత భారీ సినిమాలు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ ల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమూడు సినిమాలకు సంబంధించి కరోనా వల్ల ఫిలిం మార్కెట్ లో వచ్చేమార్పులతో తీవ్రంగా నష్టపోయేది ‘ఆర్ ఆర్ ఆర్’ అని అంటున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో మొదలుపెట్టిన ఈమూవీ ఇప్పటికే సగంపైగా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈమూవీ బడ్జెట్ లో మార్పులు చేయలేదు. దీనికితోడు ఈమూవీకి భారీ గ్రాఫిక్స్ వర్క్స్ చాల అవసరం. సుమారు 100 కోట్ల వరకు ఈగ్రాఫిక్స్ కోసమే ఖర్చు పెట్టవలసిన పరిస్థితి.


ఇప్పుడు మారిన పరిస్థితులలో గ్రాఫిక్స్ బడ్జెట్ లో కొత్త విధిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ క్వాలిటీ దెబ్బతినే ఆస్కారం ఉంది. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి కరోనా సమస్య ప్రారంభం అవ్వకముందే ‘ఆర్ ఆర్ ఆర్’ రైట్స్ ను దిల్ రాజ్ నైజాం ఏరియాకు సంబంధించి 75 కోట్లకు సాయి కొర్రపాటి వైజాగ్ సీడెడ్ ఏరియాలకు 60 కోట్లకు కొనుక్కోవడానికి ఎగ్రిమెంట్స్ చేసుకుని అడ్వాన్స్ లు కూడ ఇచ్చారు అన్న ప్రచారం జరిగింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించి కూడ దానయ్య ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన బిజినెస్ డీల్స్ ను కరోనా సమస్యకు ముందే పూర్తి చేసి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 210 కోట్లు వచ్చే విధంగా డీల్స్ కుదుర్చుకున్నా ఇప్పుడు కరోనా సమస్య తరువాత ధియేటర్లు తెరుచుకున్నా జనం రారు అన్న భయంతో ఇప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ ను విపరీతంగా మోజుపడి కొనుక్కున్న బయ్యర్లు తాము ఒప్పుకున్న రెట్లల్లో ఇప్పుడు మళ్ళీ బేరసారాలు ఆడుతూ దానయ్యను చాలామంది ఇరుకున పెడుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. 


దీనికితోడు ఈసినిమాకు సంబంధించి చరణ్ జూనియర్ రాజమౌళిలు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే వరకు భారీ మొత్తాలలో జీతాలు పారితోషికంగా తీసుకుంటూ చివరిలో ఈసినిమా బిజినెస్ లో కూడా షేర్ తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఉంది. ఇప్పుడు ఇవ్వన్నీ లెక్కలు చూసుకుంటే నిర్మాత దానయ్యకు టెన్షన్ పెరిగిపోతోందని ‘ఆర్ ఆర్ ఆర్’ కరోనా వల్ల సంక్రాంతికి విడుదల కాకుండా వచ్చే సమ్మర్ కు వాయిదా పడితే ఈభారీ బడ్జెట్ సినిమాకు వడ్డీల రూపంగానే భారీ మొత్తాలు దానయ్య చెల్లించుకోవలసి వస్తుంది అంటూ మరొక ప్రచారం జరుగుతోంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం అంతా దానయ్య వ్యతిరేక వర్గం చేస్తున్న వ్యవహారమని ఈసమస్య నుండి ఎలా తెలివిగా బయటపడాలా అన్న విషయమై రాజమౌళి దానయ్యలు చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రస్తుతం ఈమూవీ మార్కెట్ పై నడుస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని దానయ్య సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: