ఓ వైపు బుల్లితెరపై మరోవైపు వెండి తెరపై ఎవరూ సాధించలేనంత  క్రేజ్ సంపాదించిన యాంకర్ అనసూయ. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించిన ఈ అమ్మడు తన నటనతో ఇంకెంతో మంది ప్రేక్షకులను సంపాదించింది. మరోవైపు తన వాక్చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది యాంకర్ అనసూయ. అప్పుడు వరకు మామూలు ప్రోగ్రాం లు  చేసిన ఈ అమ్మడు జబర్దస్త్ లోకి ఒక్కసారి యాంకర్ గా అడుగు పెట్టిందో లేదో ఈ అమ్మడి క్రేజ్  అమాంతం పెరిగిపోయింది. జబర్దస్త్ షో పాపులారిటీ సంపాదించిన కొద్ది అనసూయ కూడా జబర్దస్త్ షో తో పాటు ఎంతో పాపులారిటీ సంపాదించింది అని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా అనసూయ నక్కతోక తొక్కినది  అనే చెప్పాలి. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో తర్వాత అనసూయ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

 

 

 కెరీర్ మొత్తం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. జబర్దస్త్ తర్వాత అందరి చూపు అనసూయ పైనే. దీంతో ఏ ఛానల్లో చూసినా అనసూయ దర్శనమిచ్చేది. ఇక అటు సినిమాల్లో కూడా ఎన్నో ఛాన్సులు కొట్టేసింది ఈ అమ్మడు. నటిగా కూడా తన సత్తా చాటింది. అయితే యాంకర్ అనసూయ గురించి ఇప్పటికీ కొంత మందికి కొన్ని నిజాలు తెలియవు. అవేంటంటే కాలేజీ సమయంలోనే అనసూయ తన భర్త భరద్వాజ్ ఎన్సిసి క్యాంపు ప్రేమలో పడింది. అప్పటి నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతూనే ఉంది. భరద్వాజ్ ధైర్యసాహసాలను చూసి అనసూయ ఫ్లాట్ అయిపోయిందట.

 

 

అయితే మొదట వీరి పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోకపోయినా ఆ తర్వాత మాత్రం ఒప్పుకున్నారట. ఇక అంతే కాకుండా మొదటి నుంచి మీడియా రంగంపై ఆసక్తి ఉన్న అనసూయ మొదట ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్గా పని చేసిందట. ఆ తర్వాత జబర్దస్త్ షో ప్రారంభిస్తున్న సమయంలో  కొత్త వాళ్లను  తీసుకోవాలని జబర్దస్త్ షో నిర్వాహకులు భావించడంతో న్యూస్ రీడర్ గా ఉన్న అనసూయను సెలెక్ట్ చేసారట నిర్వాహకులు. 

 

 

ఇక ఆ తర్వాత అనసూయ కొన్ని రోజుల తడబడినప్పటికీ ఆ తర్వాత తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ప్రెగ్నెంట్ గా  ఉన్న సమయంలో జబర్దస్త్ షో కి కాస్త గ్యాప్ ఇచ్చినది  అనసూయ. ఈ సమయంలోనే రష్మీ  జబర్దస్త్ లో యాంకర్ గా వచ్చింది. జబర్దస్త్ లోకి అనసూయ మళ్లీ రావాలని భావించినప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ది ప్రారంభించారట నిర్వాహకులు. ఇక ఈ అమ్మడు అటు వెండి తెరపై కూడా ఎన్నో పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: