నటీనటులు ఎన్నో సినిమాల్లో, ఎన్నో పాత్రలు చేసినప్పటికీ వారికి కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో చేయాలని ఉంటుంది. అలాంటి పాత్రలు తమకి బాగా నప్పుతాయనో, లేక ఆ పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ నచ్చడం వల్లనో బాగా ఇష్టం ఏర్పడుతుంది. అంతే కాకుండా అభిమానులు సైతం ఒకానొక ప్రత్యేక పాత్రల్లో చూడడానికి ఇష్టపడతారు. అయితే అలాంటి పాత్రలు దొరకడం చాలా కష్టం. మనకి నచ్చిన పాత్రలు కథా పరంగా సినిమాలో ఉండాలో లేదో నిర్ణయించేది దర్శకుడే.

 

అయితే స్టార్ హీరోల దగ్గరికి వచ్చేసరికి ఈ నియమం మారిపోతుంటుంది. వారు అనుకున్న పాత్రల్లో నటించే అవకాశాలు నిర్మాతలు కల్పిస్తారు. అలాగని ప్రతీసారీ వారు అనుకున్నట్టు చేయలేరు. ఏదైనా ఒక సినిమాలో తమకి కావాల్సిన పాత్రలో నటించి మురిసిపోతారు. అయితే ప్రతీ హీరోకి కొన్ని కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలని ఉంటుంది. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బాగా నచ్చే పాత్రల్లో నక్సలైట్ పాత్ర కూడా ఒకటి.

 

పవన్ కళ్యాణ్ సమాజంలో జరిగే అన్యాయాలకు స్పందిస్తాడు. ఆపదలో ఉన్న్నవారిని ఆదుకుంటాడు. ప్రశ్నించే గుణం ఆయన సొంతం. అందుకే పవన్ కళ్యాణ్ కి నక్సలైట్ పాత్ర అంటే బాగా ఇష్టమని చెబుతారు. అయితే తన తన కెరీర్లో పవన్ కళ్యాణ్ నక్సలైట్ గా కనిపించింది ఒక్కసారే. 
పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ నక్సలైట్ గా కనిపించాడు. 

 


అయితే కథలో నక్సలైట్ గా మారడానికి తెలంగాణ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మాండలికంలో మాట్లాడతాడు. ఈ పాత్ర గమనంలో వచ్చే పాట చాల అర్థవంతంగా ఉంటుంది. అయితే అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తే ఇంకా బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: